మరోసారి నవ్వులపాలైన పాకిస్థాన్‌ | Serena Hotel Still Awaits Payment From Pakistan After US Iran Talks | Sakshi
Sakshi News home page

మరోసారి నవ్వులపాలైన పాకిస్థాన్‌

Apr 14 2026 8:31 PM | Updated on Apr 14 2026 8:45 PM

Serena Hotel Still Awaits Payment From Pakistan After US Iran Talks

ఇస్లామాబాద్‌: ఏప్రిల్ 10-12 మధ్య ఇరాన్‌-అమెరికా చర్చలకు పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన హోటల్ బిల్లులను చెల్లించడంలో పాక్‌ విఫలమైందని.. అంతర్జాతీయంగా తలవంపులు తెచ్చుకుందంటూ ప్రచారం జరుగుతోంది. పరిస్థితి చేయి దాటడంతో.. హోటల్ యజమాని స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. హోటల్ బిల్లు కూడా పాక్‌ కట్టలేకపోవడంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై మరోసారి చర్చ జరుగుతోంది.

అమెరికా-ఇరాన్ మధ్య రెండో రౌండ్ శాంతి చర్చలు ఈ వారంలోనే పాకిస్థాన్‌లో ప్రారంభం కానున్నాయి. అసలే ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న పాక్‌కు రాబోయే చర్చలకు ఆతిథ్యం ఇవ్వడం ఇప్పుడు సవాలుగా మారింది. వాషింగ్టన్- టెహ్రాన్ మధ్య ఉన్న రెండు వారాల కాల్పుల విరమణ ఏప్రిల్ 21తో ముగియనున్న నేపథ్యంలో ఏప్రిల్ 16న ఈ చర్చలు జరిగే అవకాశం ఉందని రాయిటర్స్‌ పేర్యొంది.  అయితే, ఈసారి కూడా గతంలో వచ్చిన స్థాయి ప్రతినిధి బృందాలు వస్తాయా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఇరాన్, అమెరికా మధ్య యుద్ధాన్ని ఆపడానికి పాకిస్తాన్‌ మధ్యవర్తి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలకడం ద్వారా అంతర్జాతీయస్థాయిలో కీర్తి శిఖరాలను అధిరోహించాలని పాకిస్తాన్‌ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నిస్తోంది. అమెరికా-ఇరాన్ చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన పాక్‌.. ఇస్లామాబాద్‌లోని హోటల్ సెరెనాలో ఏర్పాట్లు చేసింది. తీరా ఈ చర్చలు విఫలమవ్వడంతో.. చివరకు చెల్లింపులు లేవు, డీల్ లేదన్నట్లుగా పరిస్థితి మారింది. చివరికి హోటల్‌ బిల్లుల భారం మాత్రం మిగిలింది.

మరోవైపు, ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్‌కు మరో సమస్య వచ్చి పడింది.  యూఏఈ ఇచ్చిన $3 బిలియన్ డాలర్లు అప్పు పూర్తిగా తిరిగి చెల్లించాలని కోరడంతో ఎలా చెల్లించేది అనే సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అసలే డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఈ అప్పులు ఎలా చెల్లించేదని ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.

మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా పెరుగుతున్న ముడిచమురు ధరల వల్ల పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారింది. ఇంతకాలంగా యూఏఈకి ఉన్న అప్పును పలు దపాలుగా పాకిస్థాన్‌ వాయిదా వేస్తో వచ్చింది.. అయితే ప్రస్తుతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్పు చెల్లించాలని కోరడంతో  ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement