Russia Ukraine War: ఉక్రెయిన్‌, రష్యా మధ్య రెండో దశ చర్చలు.. ఎజెండాలోని అంశాలు ఇవే!

Russia Ukraine War: Second Round Meeting Between Russia Ukraine March 3 - Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టి ఇప్పటికే ఎనిమిది రోజులు గడుస్తోంది. దీని వల్ల ఉక్రెయిన్‌ భారీగా నష్టపోయింది. అంతేకాకుండా యుద్ధ ప్రభావం రష్యా మీద కూడా ప్రతికూలంగానే ఉంది. సమస్య పరిష్కారం దిశగా వెళ్లాలని ప్రపంచ దేశాలు ఈ ఇరు దేశాలకు చెప్తున్నాయి. అయితే ఎవరివాదన వారిదేనన్నట్లు ఉంది రష్యా ఉక్రెయిన్‌ తీరు. ఎట్టికేలకు ఉక్రెయిన్‌, రష్యా మధ్య రెండో దశ చర్చలు బెలారస్‌- పోలాండ్‌ మధ్య చర్చలు జరిగాయి. చర్చలోకి వచ్చిన ఎజెండాలోని అంశాలు ఇవే

1. వెంటనే కాల్పుల విరమణ
2.యుద్ధ విరమణ
3. పౌరులు సరిహద్దులు దాటేందుకు వీలుగా చర్యలు

చర్చలు చర్చలే..  దాడులు దాడులేనని అంతవరకు పరిస్థితిలో ఏ మార్పు రాదని రష్యా చెప్తోంది. మా డిమాండ్లను ఇంతకు ముందే చెప్పం.. అది ఒప్పుకుంటేనే యుద్ధం ఆగుతుందని రష్యా స్పష్టం చేసింది. దోనాస్క్‌ ల్యూనిస్క్‌లను వదిలేయాలని ఉక్రెయిన్‌ అంటోంది. ప్రస్తుతం ఈ రెండో విడత చర్చల కోసం ఉక్రెయిన్‌ ప్రతినిధులు బెలారస్‌కు బయలుదేరారు.  కాగా ఫిబ్రవరి 28న బెలారస్‌లో రష్యా ఉక్రెయిన్‌ల మధ్య సుమారు 4 గంటల చర్చలు జరిగాయి. అయితే, ఇరు వర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా చర్చలు విఫలమైయ్యాయి. ప్రస్తుతం గురువారం జరగబోయే చర్చలైనా సఫలం అవ్వాలని ఇరదేశాల ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top