Man Suffering Breathing Issue: ముక్కు రంధ్రంలో దంతాలు! షాక్‌ అయిన డాక్టర్లు!

Man Suffering Breathing Problem Shocked Tooth Growing Nostril - Sakshi

Patient's Symptoms Of Nasal Obstruction: ఇంతవరకు రోగులకు జరిగిన అరుదైన శస్త్ర చికిత్సలు గురించి విన్నాం. శ్వాస కోస సమస్య అనేది చాలామందికి ఎదురై సమస్య. ఆస్మా వంటి సమస్యలున్నవారికి ఈ సమస్య మరింతగా ఉంటుంది. కానీ ఇక్కడోక  వ్యక్తి తనకి అందరిలానే శ్వాసకోస సమస్య ఉందని డాక్టర్‌ని సం‍ప్రదించాడు. అయితే ఆ తర్వాత విషయం తెలుసుకుని ఆ వ్యక్తే కాదు డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు.

అసలు విషయంలోకెళ్తే..ఇంగ్లాండ్‌కి చెందిన 38 ఏళ్ల వ్యక్తి గత కొన్ని రోజులుగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో అతను ఆసుపత్రికి వెళ్లాడు. అయితే అతను శ్వాస సమస్యతో బాధపడుతున్నాని చెప్పడంతో ఆ వ్యక్తికి డాక్టర్లు రకరకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ వ్యక్తి నాసికా రంధ్రంలో దంతం పెరుతున్నట్లు తెలుసుకుని డాక్టర్లు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

అయితే అతని ముఖకవళికలు సాధారణంగానే ఉన్నాయి కానీ ఈ దంతం ఎలా నాసికా రంధ్రంలో పెరుగుతుందనేది మొదట వారికి అర్థం కాలేదు. అయితే డాక్టర్లు కేసుని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎక్టోపిక్‌ దంతాలు పెరుగుతున్నట్లు నిర్థారించారు. ఎక్టోపిక్‌ అంటే అసాధారణంగా పెరగడం. కొంతమందిలో దంతాలు ఎగుడు దిగుడుగా పెరిగినట్లు అతనికి ముక్కు రంధ్రంలోకి చోచ్చుకుపోయి పెరుగుతున్నట్లు వెల్లడించారు.

ఆ దంతం అతని కుడి రంధ్రంలో పెరుగుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆ వ్యక్తికి ఇంట్రానాసల్ విధానం ద్వారా నోటికి సంబంధించిన ఓటోలారింగోలాజిక్ శస్త్రచికిత్స చేసి నాసికా రంధ్రం నుంచి పంటిని తొలగించారు. ఆ దంతం సుమారు 14 మి.మీటర్ల పొడవు ఉంది. మూడు నెలలు తదనంతరం అతను శ్వాసకోస సమస్య నుంచి బయటపడినట్లు డాక్టర్లు వెల్లడించారు. 

(చదవండి: ఆకాశంలో ఒక వింత!..అదేంటో అంతు చిక్కని రహస్యం!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top