
అమెరికా కాలిఫోర్నియా స్టేట్ లాస్ ఏంజిల్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వాహనం జనం మీదకు దూసుకెళ్లిన ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. వీళ్లలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం లాస్ ఏంజిల్స్ ఈస్ట్ హాలీవుడ్‌లోని శాంటా మోనికా బులివర్డ్ వద్ద ఓ వాహనం గుంపులోకి దూసుకెళ్లింది, ఈ ఘటనలో 20 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఆంబులెన్సులు, ఫైర్ సిబ్బంది క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించాయి.
గాయపడ్డవాళ్లలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మరో 8–10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి.
టాకోలను విక్రయించే ఓ బండిని ఢీకొట్టి, ఆపై క్లబ్ బయట ఉన్న గుంపులోకి వాహనం దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. వాహన డ్రైవర్ స్పృహ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయని కొందరు చెప్పినప్పటికీ.. పోలీసులు ఎలాంటి ఎలాంటి ధృవీకరణ చేయలేదు.
BREAKING: Sad and chaotic news coming from East Hollywood, Los Angeles where over 20 people injured and many in critical condition!
A vehicle had plowed into a crowd of people, the Los Angeles Fire Department reported on Saturday.
The incident occurred on Santa Monica… pic.twitter.com/i0JuEJyhlN— I Came, I Saw, They died 🇺🇸📢🇺🇸 (@4ortunefame) July 19, 2025