ఇజ్రాయెల్‌లో కీలక బిల్లు ఆమోదం.. అలా చేస్తే ఉరిశిక్షే? | Key bill approved in Israel | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌లో కీలక బిల్లు ఆమోదం.. అలా చేస్తే ఉరిశిక్షే?

Apr 1 2026 2:00 AM | Updated on Apr 1 2026 3:21 AM

Key bill approved in Israel

ఇజ్రాయెల్ పార్లమెంటు (నాసాట్) పాలస్తీనా నేరస్థులను శిక్షించే  కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ చట్టం కింద ఇజ్రాయెల్ పౌరుల హత్యలో లేదా ఉగ్రవాద కార్యకలాపాలలో పాలస్తీనియన్లు పాల్గొంటే వారికి  నేరుగా ఉరిశిక్ష విధించబడుతుంది.

ఇజ్రాయెల్‌లోని కొన్ని గ్రూపులు చాలా కాలంగా  ఈ బిల్లు కోసం డిమాండ్‌ చేస్తున్నాయి. ఎట్టకేలకు పార్లమెంటులో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. దీనిప్రకారం పాలస్తీనాకు చెందిన వ్యక్తులు తీవ్రమైన నేరాలకు న్యాయమూర్తులు ఏకాభిప్రాయం లేకుండా కూడా మరణశిక్షను ప్రకటించగలరు. అప్పీల్ చేసే హక్కు ఉండదు.  శిక్ష విధించిన 90 రోజుల్లో ఉరితీయబడతాడు. 

ఈ చట్టం జాతీయవాద లేదా తీవ్రవాద కారణాలకు వర్తిస్తుంది. అయితే కొన్ని  ప్రత్యేక కారణాల వల్ల  మరణ శిక్షను జీవిత ఖైదు విధించే హక్కు కూడా కోర్టులకు ఉంటుంది.కాగా మానవ హక్కుల సంఘాలు ఈ బిల్లును  జాతిపరంగా వివక్షతగా పేర్కొన్నాయి.  ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్ మానవ హక్కుల, పౌర సమాజ సంస్థలు ఈ చట్టం పాలస్తీనియన్లపై జాతి హింసను ప్రోత్సహిస్తున్నాయని నిరసన తెలుపుతూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కాగా ఇన్ని సంవత్సరాల ఇజ్రాయెల్ చరిత్రలో కేవలం  రెండుసార్లు మాత్రమే  ఆ ధేశంలోమరణశిక్ష విధించబడింది. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement