లగ్జరీ మాస్క్‌లతో కరోనాపై యుద్ధం

Japan fights coronavirus in luxurious style with million yen masks - Sakshi

ఖరీదైన మాస్క్‌లను రూపొందిస్తున్న జపాన్‌

వజ్రాలు,  విలువైన రాళ్లు, ముత్యాలతో లగ్జరీ మాస్క్‌

యూజర్లను ఆకట్టుకుంటున్న  ఫ్యాషన్‌ మాస్క్‌లు

టోక్యో: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న సమయంలో ఫేస్‌మాస్క్‌ ధరించడం అనివార్యంగా మారిపోయింది.  కాస్త తగ్గినట్టే మళ్లీ కోవిడ్‌-19 పంజా విసురుతున్న తరుణంలో మాస్క్‌ ధరించడం  తప్పని సరి చేస్తూ చాలా  ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. నిబంధనలు ఉల్లఘించిన వారి జరిమానా కూడా విధిస్తోంది.  ఈ నేపథ్యంలో  కరోనా మహమ్మారితో కుదేలైన ఫ్యాషన్ రంగం మాస్క్‌ల తయారీలో  నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ట్రెండ్‌కి తగ్గట్టుగా  ముత్యాలు, వజ్రాలు పొదిగన ఆకర్షణీయమైన, విలువైన లగ్జరీ మాస్క్‌లను మార్కెట్లో అందుబాటులోకి తెస్తున్నాయి.   జపాన్‌ అత్యంత ఖరీదైన విలాసవంతమైన మాస్క్‌తో  ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది.  ఖరీదైన, స్టయిలిష్‌ మాస్క్‌లతో కరోనాకు చెక్‌ పెట్టాలని భావిస్తోంది.

అమ్మకాలను ప్రోత్సహించే లక్ష్యంతో కాక్స్ కో మాస్క్.కామ్  చెయిన్‌ ముత్యాలు పొదిగిన మాస్కులతో సందడి చేస్తోంది. గత వారం చేతితో తయారు చేసిన  ముత్యాలు, వజ్రాలు  పొదిగిన మాస్క్‌లను అమ్మడం ప్రారంభించిన సంస్థ ఏకంగా  మిలియన్ డాలర్లు ఖరీదు చేసే మాస్క్‌లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. ఒక్కో  మాస్క్ ఖరీదు (9,600 డాలర్లు) ఒక మిలియన్ యాన్ ధర ఉంటుందని తయారీదారులు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా నైరాశ్యంలో మునిగిన వారు తమ  మాస్క్‌ల ద్వారా కొత్త అనుభూతి చెందుతారని  కంపెనీ  అధినేత అజుసా కజితకా రాయిటర్స్‌తో చెప్పారు. కరోనాతో జపాన్‌లో  చాలా పరిశ్రమలు సంక్షోభంలో పడిపోయాయి. ముఖ్యంగా  ఆభరణాలు, ఫాబ్రిక్ పరిశ్రమలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. అందుకే ఇక్కడి ఆర్థిక పునరుజ్జీవనంలో సహాయపడే ప్రాజెక్టులో భాగంగా దీన్ని చేపట్టామని ఆమె తెలిపారు.  వజ్రాల మాస్క్‌లను 0.7 క్యారెట్ డైమండ్లతో, 300 స్వరోవస్కి క్రిస్టల్, 330 ప్రసిద్ధి చెందిన జపనీస్ అకోయ ముత్యాలతో  ముత్యాల  మాస్క్‌లను రూపొందించినట్టు చెప్పారు.

జపాన్‌కు చెందిన మాస్క్‌లే ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత ఖరీదైనవిగా ఉన్నాయి.  ఇజ్రాయెల్‌కు ఆభరణాల వ్యాపారి వైవెల్ రూపొందించిన 250 గ్రాముల 18 క్యారెట్ల బంగారంతో చేసిన  1.5 మిలియన్ల డాలర్లు కాస్ట్‌లీ ముసుగునుతయారుచేసిన సంగతి తెలిసిందే. ది.రిటైలింగ్ గ్రూప్ అయాన్ కోలో భాగమైన కాక్స్, సెప్టెంబర్ నుండి మాస్క్.కామ్‌ ఆన్‌లైన్‌లో, ఆరు ఫిజికల్‌ స్టోర్ల ద్వారా లగ్జరీ విక్రయాలను ప్రారంభించింది. వీటి ధరలు 500 యెన్‌ల నుండి ప్రారంభమయ్యే 200 కి పైగా మాస్క్‌లను విక్రయిస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top