Flurona Virus: కోవిడ్‌ తెచ్చిన కొత్త వైరస్‌.. ఇజ్రాయెల్‌లో ఫ్లోరోనా కలకలం

Israel Detects First Case Of Flurona Combination With Covid And Influenza - Sakshi

టెల్‌ అవీవ్‌: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న వేళ... ఇజ్రాయెల్​లో ఫ్లోరోనా వ్యాధి కలకలం రేపుతోంది. ఆ దేశంలో తొలి ఫ్లోరోనా కేసు వెలుగుచూసింది. ఈ విషయాన్ని అరబ్ న్యూస్ వార్తా సంస్థ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. వ్యాధి కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఫ్లొరోనా అంటే కొవిడ్-19, ఇన్​ఫ్లూయెంజా డబుల్ ఇన్​ఫెక్షన్ అని వైద్యులు తెలిపారు. 

మరోవైపు భారీ సంఖ్యలో కోవిడ్‌ కేసులు వెలుగుచూస్త్ను నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేశామని ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ జనరల్‌ నచ్‌మన్‌ యాష్‌ తెలిపారు. తక్కువ ఇమ్యునిటీ ఉన్నవాళ్లకు నాలుగో డోసు కూడా ఇస్తున్నట్టు వెల్లడించారు. ఒమిక్రాన్‌ నుంచి రక్షణ పొందేందుకు నాలుగో డోసు వ్యాక్సిన్‌ తప్పనిసరైందని అన్నారు. ఇక గురువారం ఒక్కరోజే 5 వేల కోవిడ్‌ కేసులు బయటపడటంతో దేశ ఆరోగ్య శాఖ మంత్రి నిట్జన్‌ హొరొవిట్జ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. చాలా కేసులు ఒమిక్రాన్‌ వేరియంట్‌వేనని అన్నారు. తమ దేశంలో ఫిఫ్త్‌ వేవ్‌ నడుస్తోందని చెప్పారు.
(చదవండి: నాలుగో వేవ్‌ నుంచి బయటపడ్డట్లే.. రెండేళ్ల తర్వాత కర్ఫ్యూ ఎత్తివేత)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top