నాలుగో వేవ్‌ నుంచి బయటపడ్డట్లే.. రెండేళ్ల తర్వాత కర్ఫ్యూ ఎత్తివేత

South Africa Lifts Night Time Covid Curfew As Omicron Wave Abates - Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు మొదటిసారిగా బయటపడిన దక్షిణాఫ్రికాలో ప్రభుత్వం కొన్ని ఆంక్షలను తొలగించింది. దాదాపు రెండేళ్లుగా రాత్రి వేళ అమలవుతున్న కర్ఫ్యూను తొలగిస్తున్నట్లు గురువారం అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.

అదేవిధంగా, సభలు, సమావేశాల్లో పాల్గొనే వారి సంఖ్యపై పరిమితిని పెంచింది. కరోనా నాలుగో వేవ్‌ తీవ్రత నుంచి దేశం బయటపడినట్లేనని పేర్కొంది. అయితే, ఒమిక్రాన్‌ కారణంగా కేసులు పెరిగే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది.  ఆఫ్రికా ఖండంలోనే అత్యధికంగా దక్షిణాఫ్రికాలో 35 లక్షల మంది కరోనా బారిన పడగా 90వేల మంది చనిపోయారు.

చదవండి: (న్యూ ఇయర్‌ ఉత్సాహంపై ఒమిక్రాన్‌ నీడ)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top