హర్మూజ్‌పై ఇరాన్‌ సంచలన ప్రకటన | Iran caps Hormuz Strait traffic prior approval mandatory | Sakshi
Sakshi News home page

హర్మూజ్‌పై ఇరాన్‌ సంచలన ప్రకటన

Apr 9 2026 9:31 PM | Updated on Apr 10 2026 9:42 AM

Iran caps Hormuz Strait traffic prior approval mandatory

అమెరికాతో ఇరాన్‌ చర్చలకు అంగీకరించిన నేపథ్యంలో హర్మూజ్‌ జలసంధిపై ఇప్పటివరకూ కొనసాగిన హీట్‌ కాస్త చల్లారింది. హర్మూజ్‌ జలసంధిని తెరవడానికి తాత్కాలికంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఇరాన్‌.. తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది. హర్మూజ్‌ జలసంధిని దాటే నౌకలు తమను తప్పకుండా సంప్రదించాలని స్పష్టం చేసింది. హర్మూజ్‌లో వాటర్‌ మైన్స్‌ ముప్పు పొంచి ఉందని, ఎలా పడితే అలా నౌకలు ఆ జలసంధిని దాటే ప్రయత్నం చేయద్దొన హెచ్చరించింది.  నౌకల రాకపోకలపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్‌జీసీ)తో సమన్వయం చేసుకున్న తర్వాతే ముందుకు సాగాలని తెలిపింది. 

రోజుకు 15 నౌకలకు మాత్రమే అనుమతి..
రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హోర్ముజ్ జలసంధిని దాటడానికి ఇరాన్ రోజుకు 15 నౌకల  మాత్రమే అనుమతిస్తుంది. ఈ జలమార్గాన్ని దాటడానికి ఆ నౌకలకు ఇరాన్ అధికారుల నుండి ముందస్తు అనుమతి కూడా అవసరం. ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, పది కంటే తక్కువ నౌకలు మాత్రమే హోర్ముజ్ జలసంధిని దాటడానికి అనుమతిస్తున్నాయి.

సీజ్‌ఫైర్‌  ఒప్పందం ప్రకారం.. ‘ హోర్ముజ్ జలసంధి గుండా రోజుకు 15కు మించి నౌకలు మించి ప్రయాణించడానికి లేదు. ఈ రాకపోకలు ఇరాన్ ఆమోదం, ఒక నిర్దిష్ట నియమావళి అమలుపై మాత్రమే ఆధారపడి ఉంటాయి’ అని ఒక సీనియర్ ఇరాన్ అధికారి చెప్పినట్లు రష్యన్ వార్తా సంస్థ TASS పేర్కొంది.

యుద్ధానికి ముందున్న యథాస్థితికి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని, కొత్త హోర్ముజ్ నియంత్రణ చట్రాన్ని సంబంధించి ప్రాంతీయ పక్షాలకు తెలియజేయడం జరిగిందని ఇరాన్ వర్గాల సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement