సెనెగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Dozens killed in Senegal bus accident - Sakshi

40 మంది దుర్మరణం

డాకర్‌: ఆఫ్రికా దేశం సెనెగల్‌లో శనివారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 40 మంది మృతి చెందారు. కఫ్రిన్‌ ప్రాంతం గ్నివీ గ్రామం వద్ద ఒకటో నంబర్‌ జాతీయ రహదారిపై ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు టైర్‌ పేలిపోవడంతో అదుపుతప్పి, ఎదురుగా వస్తున్న మరో బస్సును వేగంగా ఢీకొట్టింది. ఘటనలో రెండు బస్సుల్లోని 40 మంది చనిపోగా, మరో 78 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. రెండు బస్సులు పూర్తిగా నుజ్జయ్యాయన్నారు. ఘోర విషాదం నేపథ్యంలో దేశంలో మూడు రోజులు సంతాప దినాలుగా పాటిస్తామని అధ్యక్షుడు మాకీ సాల్‌ ప్రకటించారు.

కెన్యా–ఉగాండా సరిహద్దుల్లోనూ...
నైరోబి: ఉగాండాలోని ఎంబాలె నగరం నుంచి కెన్యా రాజధాని నైరోబి వెళ్తున్న బస్సు రెండు దేశాల సరిహద్దుల్లో ప్రమాదానికి గురైంది. 21 మంది చనిపోగా 49 మంది గాయపడ్డారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top