చైనాతో డీల్‌: ట్రంప్‌ | Donald Trump announces breakthrough trade deal with China | Sakshi
Sakshi News home page

చైనాతో డీల్‌: ట్రంప్‌

Jun 12 2025 5:23 AM | Updated on Jun 12 2025 5:23 AM

Donald Trump announces breakthrough trade deal with China

చైనాపై యూఎస్‌ సుంకాలు 55 శాతం

అమెరికాపై 10 శాతానికి డ్రాగన్‌ ఓకే

అరుదైన ఖనిజాల సరఫరాకు లైన్‌క్లియర్‌

చైనా విద్యార్థులకు అమెరికా స్వాగతం

బీజింగ్‌/వాషింగ్టన్‌: అమెరికా, చైనా నడుమ రెండు నెలల వాణిజ్య యుద్ధానికి ఇక తెరపడ్డట్టే. ఇరుదేశాల మధ్య వర్తక ఒప్పదం ఖరారైనట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ‘‘లండన్‌లో రెండు రోజుల సంప్రదింపుల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇక నేను, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తుది ఆమోదముద్ర వేయడమే తరువాయి’’ అని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ట్రూత్‌సోషల్‌లో ట్రంప్‌ పోస్ట్‌ చేశారు. 

ఇకపై చైనా దిగుమతులపై అమెరికా 55 శాతం సుంకాలు విధిస్తుంది. అమెరికా ఉత్పత్తులపై చైనా 10 శాతం టారిఫ్‌లు వసూలు చేస్తుంది’’ అని వివరించారు. విభేదాలు ముదిరిన నేపథ్యంలో అమెరికాకు మ్యాగ్నెట్లు మొదలుకుని 17 రకాల అరుదైన ఖనిజాలు తదితరాల ఎగుమతులపై నిషేధాన్ని కూడా చైనా ఎత్తేయనుందని తెలిపారు.

 ‘‘బదులుగా చైనాకు కూడా గత ఒప్పందాల మేరకు అన్ని విషయాల్లోనూ తలుపులు తెరుస్తాం. చైనా విద్యార్థులను అమెరికా కాలేజీలు, యూనివర్సిటీలు, ఇతర విద్యా సంస్థల్లోకి ఎప్పట్లాగే సాదరంగా ఆహ్వానిస్తాం’’ అని ప్రకటించారు. ‘‘ప్రస్తుతం అమెరికా, చైనా మధ్య సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుదేశాలకూ లాభదాయక రీతిలో ఒప్పందం కుదిరింది’’ అంటూ హర్షం వెలిబు చ్చారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచంలో అందుబాటులో ఉన్న మొత్తం అరుదైన ఖనిజ నిల్వల్లో 61 శాతం, ఉత్పత్తిలో ఏకంగా 91 శాతం వాటా చైనాదే.
 

Advertisement
 
Advertisement
Advertisement