పాత బంగారం.. కొత్త సింగారం

Charlie Chapli Classic Movie The Kid Cmpletes 100 Years - Sakshi

చార్లీ చాప్లిన్‌ను సొంతం చేసుకోవడానికి ప్రాంతాలు, భాషతో పనిలేదు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నవారైనా ఆయన ప్రపంచంలోకి వెళ్లి హాయిగా నవ్వుకోవచ్చు. చాప్లిన్‌ నటించి, దర్శకత్వం వహించిన ‘ది కిడ్‌’ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసిద్ధ ఫ్రెంచ్‌ ఫిల్మ్‌ కంపెనీ ఎంకే2 ‘ది కిడ్‌’తో సహా ప్రపంచ ప్రసిద్ధి పొందిన చాప్లిన్‌ చిత్రాల రిస్టోరేషన్‌ ప్రక్రియ చేపట్టింది. ‘ది గోల్డ్‌ రష్‌’ ‘సిటీ లైట్స్‌’ ‘ది సర్కస్‌’ ‘మోడ్రన్‌ టైమ్స్‌’ ‘ది గ్రేట్‌ డిక్టేటర్‌’ చిత్రాలను 4కె రిస్టోరేషన్‌ చేస్తున్నారు. ‘చార్లి చాప్లిన్‌ స్టార్‌డమ్, అద్భుత నటనకు అద్దం పట్టే చిత్రం ది కిడ్‌. ఈతరం ప్రేక్షకులు కూడా ఆనాటి భావాలు, భావోద్వేగాలతో మమేకం అవుతారు’ అంటున్నాడు ఎంకే 2 సీయివో కర్‌మిడ్జ్‌. ఆధునీకరించిన చాప్లిన్‌ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈతరం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి పోస్టర్లు. ట్రైలర్లు రెడీ చేస్తున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top