ఇదే ఆఖరి రోజు!.. బతికే ఉ‍న్నందుకు కృతజ్ఞతలు..

An Amazon Delivery Driver Is Grateful To Be Alive After A Train Slice His Truck In Half - Sakshi

న్యూయార్క్‌: కొన్ని యాక్సిడెంట్లు ఎంత భయంకరంగా జరుగుతాయంటే అసలు మనిషి బతికి ఉండే అవకాశం లేదన్నంత భయంకరంగా జరుగుతాయి. పైగా వాటిని చూస్తేనే వెన్నులో వణుకు పుట్టించేంత భయం వేస్తుంది. అచ్చం అలాంటి ఘటనే అమెరికాలో జరిగింది.

(చదవండి: బాప్‌రే!...ఎంత పెద్ద భయానక దృశ్యం!)

అసలు విషయంలోకెళ్లితే... యూఎస్‌లోని విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో అలెగ్జాండర్ ఎవాన్స్ అనే 33 ఏళ్ల వ్యక్తి అమెజాన్‌ డెలివరీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఒకరోజు ఎవాన్స్ తన అమెజాన్‌ డెలివరీ ట్రక్‌తో మిల్వాకీలోని ఆమ్‌ట్రాక్ రైలును క్రాస్‌ చేస్తుంటాడు. అయితే అదే సమయంలో ఒక రైలు వస్తుంటుంది. కానీ ఎవాన్స్‌కి ఎడమ చెవి పనిచేయదు అందువల్ల అతను రైలు శబ్దాన్ని గమనించలేకపోతాడు. 

దీంతో రైలు ఒక్కసారిగా అతని ట్రక్‌ని ఢీ కొడుతుంది. ఇక అంతే రైలు ఆ ట్రక్‌ని ఈడ్చుకుని వెళ్లిపోతుంటుంది. అయినప్పటికీ ఎవాన్స్ తన ప్రాణం రక్షించుకోవటం కోసం ఏదోరకరంగా నడపటానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో అతని ట్రక్‌ రెండు ముక్కలుగా అయిపోతుంది. అయితే అదృష్టమేమిటంటే ఎవాన్స్ ఆ ప్రమాదం నుంచి సజీవంగా బయటపడతాడు. ఈ మేరకు ఎవాన్స్‌ భార్య మాట్లాడుతూ.. ‘నా భర్తను కాపాడినందుకు దేవుడికి కృతజ్ఞతలు. రైల్వే ట్రాక్‌ క్రాసింగ్‌ల వద్ద హెచ్చరిక సిగ్నల్‌లు, గేట్లు, లైట్లు వంటి సంకేతాలు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేస్తే ఇలాంటి ప్రమాదాలు తలెత్తవు’ అంటూ ఫేస్‌బుక్‌లో చెప్పుకొచ్చింది.

(చదవండి: ప్రాణాలకోసం మూగ జీవీ పాకులాట.. మనసును కదిలించేలా..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top