టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విదేశీ శక్తులు యువతను ప్రలోభ పెడుతున్నాయనేందుకు నిదర్శనగా ఒక షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇరాన్ ఏజెంట్లతో చేతులు కలిపి గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ 14 ఏళ్ల ఇజ్రాయెల్ మైనర్ బాలుడిపై అభియెగాలు నమోదు కావడం నెట్టింట చర్చకు దారి తీసింది. టెలిగ్రామ్ ద్వారా ఇరాన్ గూఢచారులతో సంబంధాలు పెట్టుకుని, వారిచ్చిన పనులను పూర్తి చేస్తూ డబ్బులు (క్రిప్టోకరెన్సీ) తీసుకున్నట్లు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు.
మధ్య ఇజ్రాయెల్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడిపై ఇరాన్ కోసం గూఢచర్యం చేసినందుకు, ఇరాన్ గూఢచారుల కోసం డబ్బు తీసుకుని పనులు చేసినందుకు అభియోగాలు మోపినట్లు ప్రాసిక్యూటర్లు బుధవారం తెలిపారని ఇజ్రాయెల్ ఆధారిత ఐ24 న్యూస్ నివేదిక పేర్కొంది. టెల్ అవీవ్ జిల్లా బాలల న్యాయస్థానంలోని స్టేట్ అటార్నీ కార్యాలయం దాఖలు చేసిన పత్రాల ప్రకారం, ఆ బాలుడు ఉద్యోగానికి ఆశపడి, గత ఏడాది ఏప్రిల్‌లో టెలిగ్రామ్ ద్వారా ఇరాన్ గూఢచారులతో సంప్రదింపులు జరిపాడు.
ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ సంక్షోభం, కేంద్రం కీలక ప్రకటన
ఎలా మొదలైందీ అంటే..
గత ఏడాది టెలిగ్రామ్‌లో వచ్చిన 'ఉద్యోగ ప్రకటన'కు మైనర్ బాలుడు స్పందించాడు. దీంతో హ్యాండ్లర్లు బాలుడితో పరిచయం పెంచుకున్నారు. టెల్ అవీవ్ పరిసర ప్రాంతాల్లోపలు అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహించేవారు. ప్రతిఫలంగాజరిగే లావాదేవీలన్నీ క్రిప్టోకరెన్సీ రూపంలో జరిగేవని దర్యాప్తులో తేలింది. నిందితుడు తన హ్యాండ్లర్ల మార్గదర్శకత్వంలో నాలుగు డిజిటల్ వాలెట్లను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పనులన్నిటికీ కలిపి సుమారు లక్ష రూపాయలు అందుకున్నాడు.
ఇదీ చదవండి: కోట్లాదిమందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలు
ఎలాంటి పనులు చేసేవాడు
ఇచిలోవ్ ఆసుపత్రి సమీప వీధులను చిత్రీకరించడం, రామత్ గాన్ ప్రాంతంలోని పరిసరాలను మ్యాపింగ్ చేయడం. 'కిర్యా' అనే కీలక మిలిటరీ కాంప్లెక్స్‌ను గుర్తించి, తెల అవీవ్ ఆకాశహర్మ్యాలను (skyline) వీడియోలు తీయడం.
కిర్యా మిలిటరీ ప్రాంతం సమీపంలో ఒక అపార్ట్‌మెంట్‌ను వెతికి, దాని ఫోటోలను, యజమానుల వివరాలను తన హ్యాండ్లర్లకు పంపడం.మరో సందర్భంలో, విదేశాంగ మంత్రి గిడియన్ సార్ ఇంటి సమీపంలో గ్రాఫిటీ (గోడలపై రాతలు) వేసి, పరిసరాలను రికార్డ్ చేయమని అతడిని కోరారు, కానీ పాఠశాల పని కారణంగా ఆ పనిని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. అంతేకాదు అరెస్ట్ తర్వాత సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నించాడనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నాడు. తన వాలెట్‌లో ఉన్న డబ్బు తన క్లాస్‌మేట్ పంపాడని అబద్ధం చెప్పమని తన స్నేహితుడిని కోరడం ద్వారా దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేశాడని అభియోగపత్రంలో పేర్కొన్నారు.


