
7న హెచ్‌సీయూ 25వ స్నాతకోత్సవం
రాయదుర్గం: వచ్చే నెల 7న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) 25వ స్నాతకోత్సవాన్ని గచ్చిబౌలి శాంతి సరోవర్‌లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. హెచ్‌సీయూ చాన్స్‌లర్ జిస్టిస్ ఎల్ నర్సింహ్మరెడ్డి, వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ బీజేరావు పర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర శాస్త్ర , సాంకేతిక మంత్రిత్వశాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొంటారు. సుమారు 1,700 మంది గ్రాడ్యుయేట్లకు వివిధ కోర్సులలో డిగ్రీలు, ప్రతిభ చాటిన వారికి బంగారు పతకాలను ప్రదానం చేయనున్నారు. స్నాతకోత్సవంలో వ్యక్తిగతంగా డిగ్రీలను పొందాలనుకునే అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఈ నెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని హెచ్‌సీయూ అధికారులు సూచించారు.