
28 మంది పోలీసు అధికారుల ఉద్యోగ విరమణ
బంజారాహిల్స్: హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో గురువారం 28 మంది పోలీసు అధికారులు పదవీ విరమణ చేశారు. వీరిలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ వెంకటేశ్వరరావు, నలుగురు ఎస్‌ఐలు, 21 మంది ఏఎస్‌ఐలు, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరిని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (అడ్మిన్) పరిమళ హానా నూతన్ ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవీ విరమణ అనంతరం భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, శేష జీవితం కుటుంబసభ్యులతో సంతోషంగా గడపాలని కోరారు. పోలీసు శాఖకు వారు అందించిన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శ్రీనివాస్, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శంకర్‌రెడ్డి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.