
అమ్మవారి సన్నిధిలో అనుపమ పరమేశ్వరన్
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న సినీనటి
సనత్‌నగర్: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని సినీనటి అనుపమ పరమేశ్వరన్ దర్శించుకున్నారు. ఆమె నటించిన ‘పరదా’ చిత్రం వచ్చే నెల 22న విడుదల కానుండగా యూనిట్ సభ్యులతో కలిసి గురువారం బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారికి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ‘యత్ర నార్యస్తు’ పాటకు సంబంధించిన పోస్టర్లను ఈ సందర్భంగా ప్రదర్శించారు.