
లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
రాజేంద్రనగర్: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.8 వేల జరిమానా విధిస్తూ రాజేంద్రనగర్ ఫోక్సో కోర్టు న్యాయమూర్తి గురువారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్వర్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గగన్‌పహాడ్ ప్రాంతంలో ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కుటుంబం నివాసం ఉంటోంది. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు. అదే ప్రాంతంలో ఉంటున్న బిహార్‌కు చెందిన రంజిత్ సింగ్ కూలీగ పని చేసేవాడు. 2019 మార్చి 22న మూడేళ్ల బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా రంజిత్ సింగ్ ఆమెను కిడ్నాప్ చేసి సమీపంలోని మామిడికుంట చెరువు వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారిని అక్కడే వదిలి పారిపోయాడు. చిన్నారి కనిపించకపోవడంతో గాలింపు చేపట్టిన కుటుంబ సభ్యులు కుంట సమీపంలో ఆమెను గుర్తించారు. చిన్నారి లైంగికదాడి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు శంషాబాద్ ఆర్‌జీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రంజిత్ సింగ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణ చేపట్టిన ఫోక్సో కోర్టు న్యాయమూర్తి అంజనేయులు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.8 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.3 లక్షలు పరిహారం చెల్లించాలని న్యాయసేవాధికార సంస్థకు సిఫారసు చేశారు.