రిజిస్ట్రేషన్ల స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్ల స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని రద్దు చేయాలి

Apr 17 2025 7:09 AM | Updated on Apr 17 2025 7:09 AM

రిజిస్ట్రేషన్ల స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని రద్దు చేయాలి

రిజిస్ట్రేషన్ల స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని రద్దు చేయాలి

చిక్కడపల్లి: రిజిస్ట్రేషన్‌లలో స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని రద్దుచేసి డ్యాకుమెంట్‌ రైటర్స్‌కు జీవనోపాధి కల్పించాలని తెలంగాణ డ్యాకుమెంట్‌ రైటర్స్‌ ఫెడరేషన్‌ నాయకులు శ్రీనివాస్‌, గిరిబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం అశోక్‌నగర్‌లోని చిక్కడపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ముందు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్లాట్‌ విధానంతో రానున్న రోజుల్లో డాక్యుమెంట్‌ రైటర్స్‌ జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. స్లాట్‌ విధానంతో వినియోగదారులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. స్లాట్‌ పద్ధతిని రద్దుచేసి పాత విధానాన్ని కొనసాగించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డ్యామెంట్‌ రైటర్స్‌ ఈశ్వర్‌, అశోక్‌, కార్తీక్‌, బ్రహ్మం, అతీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ డ్యాకుమెంట్‌ రైటర్స్‌ ఫెడరేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement