ఇక పక్కా! | - | Sakshi
Sakshi News home page

ఇక పక్కా!

Apr 11 2025 8:52 AM | Updated on Apr 11 2025 8:52 AM

ఇక పక

ఇక పక్కా!

ఆస్తుల లెక్క..

లే ఔట్‌ ఖాళీ స్థలాలు, పార్కులు, బల్దియా కార్యాలయాలు..

మార్కెట్లు, కమ్యూనిటీ హాళ్లు, స్థిరాస్తులు తదితరాలు

అంగుళం సైతం తేడా రాకుండా డీజీపీఎస్‌ సర్వే

తొలుత ఎల్‌బీనగర్‌, కూకట్‌పల్లి జోన్ల పరిధిలో..

కన్సల్టెంట్లకు జీహెచ్‌ఎంసీ ఆహ్వానం

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో కోటి మందికి పైగా ప్రజలకు వివిధ పౌర సేవలందిస్తున్న జీహెచ్‌ఎంసీకి ప్రధాన, జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాలతో పాటు పలు ఆస్తులున్నాయి. మున్సిపల్‌ మార్కెట్లు, షాపులు, భూములతో పాటు పార్కులు, డంపింగ్‌ యార్డులు, స్లాటర్‌ హౌస్‌లు తదితరాలున్నాయి. అయినా.. తమ స్థిరాస్తులు ఎక్కడ ఎన్ని ఉన్నాయో, ఎవరి స్వాధీనంలో ఉన్నాయో, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో, వాటిలో ఎవరుంటున్నారో కనీస వివరాలు కూడా జీహెచ్‌ఎంసీ వద్ద లేకుండాపోయాయి. అంతేకాదు.. లే ఔట్‌ల ఖాళీ స్థలాల్లో పార్కులు, ఆటస్థలాలు, ఇతరత్రా సదుపాయాలు కల్పించాల్సి ఉండగా, అసలు ఆ లేఔట్లలోని ఖాళీ ప్రదేశాలు ఎన్ని చోట్ల ఉన్నాయో, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో వంటి వివరాలు కూడా జీహెచ్‌ఎంసీ వద్ద లేవు. సుదీర్ఘ కాలం మొద్దు నిద్ర తర్వాత ఎట్టకేలకు జీహెచ్‌ఎంసీ తమ ఆస్తులెన్ని ఉన్నాయో కచ్చితంగా తెలుసుకోవాలనే నిర్ణయానికొచ్చింది. అందుకుగాను ఆషామాషీగా కాకుండా కచ్చితమైన, అంగుళం కూడా తేడా రాకుండా వాటిని కనిపెట్టడంతోపాటు రియల్‌ టైమ్‌లోనూ వాటిని ఆన్‌లైన్‌ ద్వారా వీక్షించే సదుపాయం ఉండాలని భావిస్తోంది. అందుకోసం తమ స్థిరాస్తుల సర్వే, డిజిటలీకరణ, జియో రిఫరెన్సింగ్‌ తదితరమైనవి చేయగల కన్సల్టెంట్ల సేవలను ఆహ్వానిస్తూ రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ)టెండర్లను ఆహ్వానించింది. ఈ పనులకు ఎంపికయ్యే కన్సల్టెన్సీ జీపీఎస్‌ సర్వే కాకుండా అంగుళం వరకు కూడా కచ్చితమైన వివరాలందజేయగల డీజీపీఎస్‌ (డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌) సర్వే నిర్వహించాల్సి ఉంటుంది.

సర్వే చేయాలిలా..

ప్రతి ఆస్తికి సంబంధించిన విస్తీర్ణం, సరిహద్దులు, చుట్టుపక్కల ఉన్న భవనాలు, రోడ్లు, వాటర్‌, విద్యుత్‌, సివరేజి వంటి యుటిలిటీస్‌ లైన్లు తదితరమైనవి డీజీపీఎస్‌ను ఉపయోగించి చేయాలి. ఆస్తికి సంబంధించి ప్రతీ మూల రియల్‌ కోఆర్డినేట్లు గుర్తించాలి. అన్ని భవనాల ముందు, పక్కల, లోపల దృశ్యాలు కనిపించేలా ఫొటోలు తీయాలి. సదరు భవనం జీహెచ్‌ఎంసీ ఏ సర్కిల్‌లో ఉందో పేర్కొనడంతో పాటు సర్వే నెంబరు, టౌన్‌ సర్వే నెంబరు, డోర్‌ నెంబర్‌, లొకాలిటీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లతో పాటు ఖాళీ ప్రదేశమా, భవనమా, భవనమైతే నాలుగువైపులా సరిహద్దులు, ప్రహరీ ఉందా.. లేదా? భవనమైతే ప్రస్తుత వినియోగం, బిల్టప్‌ ఏరియా, భవనంపేరు వంటి వివరాలు పొందుపరచాలి.

● లే ఔట్‌ ఓపెన్‌ స్పేస్‌లైతే లే ఔట్‌ పేరు, నెంబరు, లే ఔట్‌ మేరకు ఎంత ఓపెన్‌స్పేస్‌ ఉండాలి.. ఎంత ఉంది.. (చదరపు గజాల్లో), ఎంత మేర కబ్జా అయింది, కబ్జాలో జరిగిన నిర్మాణాల వంటి వివరాలు సైతం పొందుపరచాలి. జీహెచ్‌ఎంసీకి సంబంధించిన స్థిరాస్తులన్నింటికీ యూనిక్‌ ఐడీ నెంబరు ఇవ్వాలి. ఇందుకుగాను తగినన్ని బృందాల్ని నియమించాలి. జోన్‌కు కనీసం రెండు బృందాల వంతున ఆరు జోన్లకు తగినన్ని బృందాల్ని నియమించాలి. ఈ బృందాలకు ఆయా అంశాల్లో జీహెఎంసీ టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ, ఇంజినీరింగ్‌ విభాగాలు సహకరిస్తాయి. టౌన్‌ప్లానింగ్‌ విభాగం ఆధ్వర్యంలో సర్వే చేయిస్తారు. తొలుత ప్రయోగాత్మకంగా ఎల్‌బీనగర్‌, కూకట్‌పల్లి జోన్లలో ఈ సర్వే నిర్వహిస్తారు.

ఇక పక్కా!1
1/2

ఇక పక్కా!

ఇక పక్కా!2
2/2

ఇక పక్కా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement