కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం | - | Sakshi
Sakshi News home page

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం

Mar 27 2025 6:05 AM | Updated on Mar 27 2025 6:05 AM

కోటి

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం

గచ్చిబౌలి: రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. బుధవారం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియాలో సీ్త్రనిధి 12వ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ 2011లో కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో మొదలైన సీ్త్రనిధి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. అవకాశాలు ఇస్తే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారని, కోటిమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. కోవిడ్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన యువతులను సీ్త్రనిధి సభ్యులుగా చేర్చి ఆదుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలు గౌరవంగా ఉండే విధంగా మహిళాఆర్మీ కృషి చేస్తుందని, అందుకు త్వరలోనే మార్యదర్శకాలు రూపొందిస్తామని చెప్పారు. పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా సీ్త్ర నిధికి భవనం కేటాయిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. సీ్త్రనిధి బ్యాంక్‌పై సెర్ప్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రవిందర్‌రావు రూపొందించిన పాటను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. అనంతరం డివిడెండ్‌ ఫండ్‌ చెక్‌ను మహిళా సమాఖ్య సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈఆర్‌పీ సీఈఓ దివ్య, సీ్త్రనిధి అధ్యక్షురాలు ఇందిర, ఎండీ విద్యాసాగర్‌రెడ్డి, కోశాధికారి సరస్వతి, కొమురంభీం అడిషనల్‌ కలెక్టర్‌ దీపక్‌తివారి, వరంగల్‌ అడిషనల్‌ కలెక్టర్‌ సంధ్యారాణి, కోఆపరేటివ్‌ సొసైటీస్‌ రిజిస్ట్రార్‌ సురేంద్రమోహన్‌, మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం 1
1/1

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement