
వెంగళరావు నగర్: కాంగ్రెస్ పార్టీ హయాంలో మాత్రమే నగరం అభివృద్ధి చెందిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నేత నవీన్‌యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..చిన్న శ్రీశైలం యాదవ్, ఆయన కుమారుడు నవీన్ యాదవ్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీకి మరింత బలాన్నిచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో నగరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ విజయం సాధిస్తారని అన్నారు. నవీన్ యాదవ్‌ను గొప్ప రాజకీయ నాయకునిగా చేసే బాధ్యత కాంగ్రెస్‌దని, నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలను భుజస్కందాలపైన వేసుకుని ఇక్కడ కాంగ్రెస్‌ను గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అజహరుద్దీన్, కార్పొరేటర్ సీఎం రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భవానీ శంకర్, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.