
హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆటపై ఉన్న అభిమానం ఎలాంటిదో ఉప్పల్ స్టేడియంలో కనిపించింది. భారత జట్టు లేకపోతేనేమి, వామప్ మ్యాచ్ మాత్రమే అయితేనేమి.. క్రికెట్ అభిమానులంతా మైదానానికి చేరి సందడి చేశారు. మంగళవారం రాజీవ్‌గాంధీ స్టేడియంలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌కు అభిమానులు చెప్పుకోదగ్గ సంఖ్యలో హాజరయ్యారు. ఉప్పల్‌ను తన సొంతగడ్డలా భావించే డేవిడ్ వార్నర్ ఎప్పటిలాగే తనదైన శైలిలో ‘పుష్ప’ మేనరిజమ్స్, బుట్టబొమ్మా పాటలకు డ్యాన్స్‌లతో వినోదం పంచాడు.