25 వేల టీచర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి | - | Sakshi
Sakshi News home page

25 వేల టీచర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి

Oct 4 2023 7:54 AM | Updated on Oct 4 2023 7:54 AM

ధర్నాలో అభివాదం చేస్తున్న నాయకులు - Sakshi

ధర్నాలో అభివాదం చేస్తున్న నాయకులు

ఎల్లంపేట్‌లో చిన్నారులపై వీధి కుక్కల దాడి

– ఐదుగురికి గాయాలు

మేడ్చల్‌ రూరల్‌: మండలంలోని ఎల్లంపేట్‌ గ్రామంలో వీధి కుక్కలు మంగళవారం రెచ్చిపోయాయి. ఐదుగురు చిన్నారులపై దాడి చేయడంతో గాయాలపాలయ్యారు. మూడేళ్ల రుత్విక్‌, నాలుగేళ్ల కౌశిక్‌తో పాటు పలువురు చిన్నారులు ఇళ్ల ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో చిన్నారులు రుత్విక్‌, కౌశిక్‌లు తీవ్రంగా గాయపడగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా వీధి కుక్కల స్వైర విహారంపై గత మూడు నెలలుగా గ్రామ పంచాయతీ పాలకవర్గం అధికారులకు ఫిర్యాదు చేసినా, వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోకపోవడం వల్లే నేడు చిన్నారులు ప్రమాదాల బారిన పడ్డారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముషీరాబాద్‌: తొమ్మిదేళ్లుగా టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ వేయకుండా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని పలువురు నేతలు విమర్శించారు. తెలంగాణ ఏర్పడితే బతుకులు బాగుపడతాయని ఆశించిన వారికి నిరాశే మిగిలిందని పేర్కొన్నారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం, నిరుద్యోగ జేఏీసీ సంయుక్త ఆధ్వర్యంలో మెగా డీఎస్సీని ప్రకటించాలంటూ ఇందిరాపార్కు వద్ద మహాధర్నాను నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య, బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, ప్రొఫెసర్‌ కోదండరాంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.... 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్‌ ఏ ఒక్కరోజుకూడా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను పలకరించిన సందర్భం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 వేలకు పైగా టీచర్‌పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 5 వేల పోస్టులను ప్రకటించి ప్రభుత్వంబాధ్యతల నుంచి తప్పుకుంటుందని విమర్శించారు. 5 వేల పోస్టుల నోటిఫికేషన్‌ రద్దు చేసి..25 వేల పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లడుతూ..ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం టీచర్‌పోస్టులను భర్తీ చేయడంలేదని ఆరోపించారు. నవంబర్‌లో జరగనున్న డీఎస్సీ పరీక్షను నాలుగు నెలలు వాయిదా వేసి అభ్యర్థుల ప్రిపరేషన్‌కు సమయం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల పాఠశాలల్లో ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌, సైన్స్‌ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేరని, దీంతో ఆయా సబ్జెక్టులలో విద్యార్థులకు విషయ పరిజ్ఞానం లేక జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విఫలమవుతున్నారని చెప్పారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ నీలా వెంకటేష్‌ , బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాధర్నాలో బీసీ నాయకులు రామ్మోహన్‌, నందగోపాల్‌, శివకృష్ణ, పి.వై.ఎల్‌ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌

ఇందిరాపార్కు వద్ద బీసీ సంఘం, నిరుద్యోగ జేఏసీ ధర్నా

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement