
బన్సీలాల్‌పేట్: రాంగ్‌రూట్‌లో వచ్చిన ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
ఎస్‌ఐ జీవన్‌రెడ్డి తెలిపిన మేరకు.. గురువారం తెల్లవారు జామున నింబోలిఅడ్డ ప్రాంతానికి చెందిన దుస్తుల వ్యాపారి గోవింద్ కర్వా(30) తన ద్విచక్ర వాహనంపై సికింద్రాబాద్ నుంచి కాచిగూడ వైపు వెళ్లడానికి ట్యాంక్‌బండ్‌పైకి వచ్చాడు. చిల్డ్రన్స్ పార్కు వద్ద రాంగ్‌రూట్‌లో వచ్చిన ఐ10 కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొని కొంత దూరం వరకు లాక్కెళ్లింది. అదే సమయంలో అటు వైపు వచ్చిన మరో కారు సురేష్‌కార్వాను ఢీకొట్టింది. దాంతో సురేష్ తీవ్ర రక్తస్రావంతో పడిపోయాడు. సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు వెంటనే అతనిని గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశాడని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా రాంగ్‌రూట్‌లో వచ్చిన కారులో ఉన్న నలుగురూ గాయపడ్డారు. వీరిలో ఓ వృద్ధుడి (60)కి తీవ్రగాయాలయ్యాయి. వీరు సికింద్రాబాద్ సన్‌షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
● ట్యాంక్‌బండ్‌పై ప్రమాదం
● రాంగ్‌రూట్‌లో వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు