
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ
గన్‌ఫౌండ్రీ: నది తల్లిలాంటిదని నదుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం ఆదర్శ్‌నగర్‌లోని బిర్లా సైన్స్ సెంటర్‌లో గోదావరి హారతి యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. పర్యావరణం భారతీయ సంస్కృతిలో భాగమన్నారు. గోదావరి నదిలో రసాయనాలు, వ్యర్థాలు కలుస్తున్నాయని వాటి నుంచి గోదావరి నదిని రక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గోదావరి నది అధ్యయనం కోసం నిర్వహిస్తున్న యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. గోదావరి హారతి ఉత్సవ సమితి వ్యవస్థాపక ఛైర్మన్ మురళీధర్‌రావు మాట్లాడుతూ.... జూన్ 3వ తేదీన కందకుర్తిలో ప్రారంభమై బాసర, ధర్మపురి, కాళేశ్వరం, రామన్నగూడెం ప్రాంతాల మీదుగా జూన్ 8వ తేదీన ఈ యాత్ర ముగుస్తుందని వెల్లడించారు.