పొదుపు సంఘాల వివరాలకు ‘లోకోస్‌’ | - | Sakshi
Sakshi News home page

పొదుపు సంఘాల వివరాలకు ‘లోకోస్‌’

Apr 18 2023 4:40 AM | Updated on Apr 18 2023 4:40 AM

సమావేశమైన పొదుపు సంఘాల సభ్యులు (ఫైల్‌)  - Sakshi

సమావేశమైన పొదుపు సంఘాల సభ్యులు (ఫైల్‌)

బంజారాహిల్స్‌: జీహెచ్‌ఎంసీ జూబ్లీహిల్స్‌ సర్కిల్‌–18 పరిధి కిందకు వచ్చే బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, వెంకటేశ్వరకాలనీ, షేక్‌పేట డివిజన్ల పరిధిలో మొత్తం 1149 గ్రూపులు ఉన్నాయి. ఖైరతాబాద్‌ నియోజకవర్గం పరిధిలో మొత్తం 1676 గ్రూపులు ఉన్నాయి. వీటన్నింటి వివరాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించిన లోకోస్‌ యాప్‌లో నమోదు చేయనున్నారు. ఇప్పటి వరకు పొదుపు సంఘాల వ్యవహారాలను రాష్ట్ర స్థాయిలో పరిశీలన చేసేవారు.

● కొత్త యాప్‌పై త్వరలోనే క్షేత్ర స్థాయిలో అవ గాహన కలిగించేందుకు కమ్యూనిటీ ఆర్గనైజర్ల కు రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.

● సీవోలు తమ పరిధిలోని స్వయం సహాయక బృందాల అధ్యక్షురాళ్లకు అవగాహన కలిగిస్తా రు. ఆయా అధ్యక్షురాళ్లు తమ కింద ఉండే పది మంది మహిళలకు ఈ యాప్‌పై అవగాహన కలిగించి దీని ఉపయోగాలను వివరిస్తారు.

● త్వరలోనే ఇందుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తున్నది. వీ రంతా మిగతా క్షేత్ర స్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చి ఈ యాప్‌ను త్వరలోనే అమలు చేయనున్నారు.

● ఇప్పటి వరకు పొదుపు సంఘాల ఆర్థిక వ్యవహారాలు స్థానికంగా నిర్వహించేవారు. వీరికి ఒక అధికారి కూడా ఉండేవారు.

● పొదుపు సంఘాల మహిళల ఆర్థిక వివరాలను నమోదుచేసి మెప్మాకు జవాబుదారీగా ఉండేవారు. వీరు సంఘం ప్రతినిధులు కావడంతో కొన్ని లోపాలు ఉన్నాయని మరికొన్ని చోట్ల తేడాలున్నాయని కేంద్రం గమనించింది.

● ఆర్థిక వ్యవహారాలు, రుణ చెల్లింపులు, గ్రూపుల సమావేశాలు, కొత్త గ్రూపుల ఏర్పాటు ఉన్న గ్రూపులు ఎందుకు సంఘటితంగా లేకుండా డీఫాల్ట్‌ అవుతున్నాయనే వివరాలను పారదర్శకంగా ఉండేలా జవాబుదారీతనాన్ని పెంచేందుకు మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు కేంద్రం ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

● ఇకపై వివరాల నమోదు బాధ్యతను కమ్యూనిటీ ఆర్గనైజర్లు, మహిళా సంఘాల అధ్యక్షురాళ్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. పొదుపు సంఘాల మహిళల పూర్తి రుణ వ్యవహారాలు, తీసుకున్న రుణాలు, వాయిదాలు చెల్లించే వివరాలు, సమావేశాలకు హాజరైన తీరు, రుణ వాయిదాల చెల్లింపుల్లో అనుసరించిన పద్ధతులు, పొందిన వడ్డీ రాయితీలు ఎలా ఉపాధి పొందుతున్నారు, ఎంత వరకు దీని వల్ల లాభపడుతున్నారు తదితర వివరాలను నిక్షిప్తం చేస్తారు.

● సంఘంలోని సభ్యురాలి పేరు, వయసు, ఆదాయ వనరు, ఆధార్‌ నంబర్‌, విద్యార్హతలు కూడా ఈ యాప్‌లో నమోదు చేయనున్నారు.

● సభ్యురాలి వివరాలను ఎప్పటికప్పుడు నమో దు చేసి ఆన్‌లైన్‌లో ఉన్నతాధికారులు పరిశీలించేలా చేస్తారు. ప్రతి ఆర్థిక వ్యవహారంలో ఉన్నతాధికారులు కేంద్రం, నుంచి రాష్ట్రం వరకు పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది.

● ఒక్కో కమ్యూనిటీ ఆర్గనైజర్‌కు 200 సంఘాల పర్యవేక్షణ బాధ్యతలు ఉన్నాయి. తరచూ వాటి గురించి ఆలోచిస్తున్న నేపథ్యంలో సంఘాల వివరాలు కూడా ఉన్నతాధికారులు తెలుసుకునేందుకు ప్రభుత్వం కూడా పరిశీలించేందుకు ఇక సులువు కానుంది.

● ఈ నెలాఖరు కల్లా సిబ్బందికి శిక్షణ ఇచ్చి వచ్చే రెండు నెలల్లో లోకోస్‌ యాప్‌ను తీసుకొచ్చేందుకు సంబంధిత యంత్రాంగం సన్నద్ధం అవుతోంది.

యాప్‌ వినియోగం ఇతరత్రా అంశాలపై త్వరలో యూసీడీ ఉద్యోగులకు శిక్షణ

ఇకపై లోకోస్‌ యాప్‌లోనే సమగ్ర సమాచారం

చాలా ఉపయోగాలు ఉంటాయంటున్న అధికారులు

పొదుపు సంఘాల మహిళల ఆర్థిక వ్యవహారాలు, రుణాల వాయిదాల చెల్లింపులు, ప్రతి నెలా సమావేశాలు, తీసుకున్న రుణాలతో చేస్తున్న వ్యాపారాలు, ఎలా ఉపాధి పొందుతున్నారు అన్న అంశాలను ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం రూపొందించి ప్రత్యేక యాప్‌ లోకోస్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు సంబంధిత జీహెచ్‌ఎంసీ యూసీడీ అధికారులకు తగిన సమాచారం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement