
సాక్షి, సిటీబ్యూరో: మద్యం విక్రయాలు ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించాయి. గత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 వరకు) గ్రేటర్ జిల్లాల నుంచి రూ.13,518.87 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా రూ.35 వేల కోట్ల ఆదాయం వస్తే.. ఈ మూడు జిల్లాల నుంచే 42–45 శాతం రావడం గమనార్హం. మద్యం అమ్మకాల్లో రూ.8436.14 కోట్లతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. రూ.3,752. 96 కోట్లు ఆదాయంతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. రూ.1,329.78 కోట్లతో మేడ్చల్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది.
ఇక్కడే ఎక్కువ ఎందుకంటే?
ఐటీ అనుబంధ సంస్థలు ఇక్కడ అధికం. ఉద్యోగుల నెలసరి వేతనాలు రూ.లక్షల్లో ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల రాకతో శివారు జిల్లాల్లోని భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. మార్కెటింగ్ ఎజెంట్ల ఆదాయం భారీగా ఉంటుంది. శుభ కార్యాల్లోనే కాదు వీకెండ్ పేరుతో విందులు, వినోదాల్లో మద్యం తప్పనిసరైంది. లిక్కర్ అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. ఖరీదైన మద్యం అమ్మకాలు కూడా ఇక్కడే అధికం.
గ్రేటర్‌లో మద్యం అమ్మకాలు (రూ.కోట్లలో..)
నెల హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్
ఏప్రిల్ 260.62 629.02 100.55
మే 307.41 704.64 114.82
జూన్ 298.61 685.47 107.31
జూలై 359.82 741.89 119.07
ఆగస్టు 323.72 726.33 117.44
సెప్టెంబర్ 299.04 671.79 102.32
అక్టోబర్ 345.04 731.77 119.28
నవంబర్ 277.05 579.79 84.53
డిసెంబర్ 382.28 881.21 140.89
జనవరి 287.23 666.86 103.81
ఫిబ్రవరి 310.59 710.75 111.47
మార్చి 300.75 706.62 108.29