మా ప్రచురణ | - | Sakshi
Sakshi News home page

మా ప్రచురణ

Oct 13 2026 1:17 AM | Updated on Oct 13 2026 1:17 AM

మంగళవారం శ్రీ 13 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
ఎస్‌ఐల ఎపిసోడ్‌ పూర్తి.. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ల సీన్‌ మొదలు

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

పోలీస్‌ వర్గాల్లో బదిలీల కాక మొదలైంది. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎస్‌ఐల బదిలీల పర్వం ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టింగ్‌లపై పడింది. ఈ నెల 10న ఏకంగా 35 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే. తదుపరి వంతు పోలీస్‌ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలుగా ఉన్న ఇన్‌స్పెక్టర్లదేనన్న ప్రచారం జరుగుతోంది. గత ఆగస్టులో 22మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. ధర్మసాగర్‌, ఎల్కతుర్తి, పరకాల, ఆత్మకూరు, హనుమకొండ ఉమెన్‌ ఠాణాలతో పాటు పలుచోట్ల పోస్టింగ్‌ ఇచ్చారు. దసరా తర్వాత కమిషనరేట్‌ పరిధిలో పలువురు సీఐలకు స్థానచలనం ఉంటుందన్న చర్చ పోలీసు వర్గాల్లో వేడెక్కిస్తోంది.

‘కీలక’ ఠాణాల కోసం కుస్తీ..

కమిషనరేట్‌ సర్కిళ్ల పరిధిలో పట్టు.. కీలక స్టేషన్‌లో పోస్టింగ్‌.. ఇదే లక్ష్యంగా పలువురు సీఐలు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేయూసీ, సుబేదారి, హనుమకొండ, ఇంతేజార్‌ గంజ్‌, మట్వాడా, కేయూసీ, మడికొండతో తొమ్మిది పోలీస్‌స్టేషన్లలో పోస్టింగ్‌లపై కొందరు కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. కేయూసీ, సుబేదారి ఠాణాల కోసం ఓ ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌, వర్ధన్నపేట నియోజకవర్గంలో పనిచేసిన ఓ సీఐ ఇప్పటికే సిఫారసు లేఖలు పొందారన్న చర్చ ఉంది. గ్రేటర్‌ వరంగల్‌లోని ఓ ట్రాఫిక్‌ సీఐకి కూడా స్థానచలనం తప్పనిసరి అని చెబుతున్నారు. పదవీకాలం ఏడాది పూర్తయిన వాటిపై, స్టేషన్‌కు కొచ్చి కొద్దిరోజులే అయినా వివాదాస్పదంగా మారిన ఠాణాలపై కొందరు కన్నేసినట్లు సమాచారం. ఆశించిన పోస్టింగ్‌ దక్కించుకునేందుకు తమకున్న పరిచయాలను ఉపయోగించుకుంటున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి.

ఎవరికి ‘స్టేషన్‌’.. ఎవరికి ‘వీఆర్‌’?

కమిషనరేట్‌లో పోస్టింగ్‌ కోసం స్థానిక అధికారులే కాకుండా పొరుగు జిల్లాల్లో పనిచేస్తున్న కొందరు ఇన్‌స్పెక్టర్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో కమిషనరేట్‌ పరిధిలో పనిచేసి పలు వివాదాలను ఎదుర్కొన్న వారు పరిస్థితులు మారడంతో మళ్లీ వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఐజీ అటాచ్డ్‌లో ఉన్న ఇద్దరు సీఐలు, 2012 బ్యాచ్‌కు చెందిన మరో ఇన్‌స్పెక్టర్లు తమకు అనుకూలమైన పోస్టింగ్‌ కోసం ఇప్పటికే సంప్రదింపులు జరిపారన్న ప్రచారం జరుగుతోంది. ఉత్తర్వులు వెలువడటమే తరువాయి అన్న ప్రచారం వారి సహచరుల్లో వినిపిస్తోంది. దీంతో స్థానికంగా పనిచేస్తున్నవారికి ఎలాంటి పోస్టింగ్‌లు దక్కుతాయి? బయట నుంచి వచ్చేవారికి ఏయే బాధ్యతలు అప్పగిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా ఎస్‌ఐల బదిలీలతో మొదలైన కదలిక.. సీఐల వరకు విస్తరిస్తుందన్న ప్రచారంతో ఆశావహులు ఎదురుచూస్తున్నారు. దసరా తర్వాత బదిలీల జాబితా వెలువడుతుందా? కీలకస్ట్టేషన్లలో కొత్త ముఖాలు కనిపిస్తాయా? పొరుగు జిల్లాలనుంచి ఎంతమందికి అవకాశం దక్కుతుంది? అన్నది పోలీస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

దసరా సెలవులు వచ్చాయి. ఈ సెలవుల్లో పిల్లలు పుస్తకాలు చదువుతున్నారా.. ఏమైనా ఆటలు ఆడుతున్నారా.. మీలోని సృజనాత్మకతతో బొమ్మలు గీస్తున్నారా.. సరదాగా అమ్మ మ్మ, నానమ్మ.. తాతయ్యతో గడుపుతున్నారా.. మీరు చేసే మంచి పనిని మాతో పంచుకోండి.. మేం ప్రచురిస్తాం. మీరు చేయాల్సిందల్లా మీరు చేసే మంచి పనిని సెల్ఫీతో ఫొటో తీసి మీ పేరు, ఊరు వివరాలను నాలుగు లైన్లలో రాసి ఫొటోతోపాటు ఈ కింది నంబర్‌కు వాట్సాప్‌ చేయండి.

మీ సృజన..

వరంగల్‌ కమిషనరేట్‌లో బదిలీల కలకలం

కీలక ఠాణాలపై గురి..

కొందరి చేతిలో లేఖలు?

పొరుగు జిల్లాలనుంచి

‘ఇన్‌’ అయ్యేందుకూ యత్నాలు..

దసరా తర్వాత మార్పులంటూ

పోలీసు వర్గాల్లో చర్చ

కమిషనరేట్‌పై పట్టుబిగిస్తున్న సీపీ..

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా జూలై 1న బాధ్యతలు చేపట్టిన ఎన్‌.శ్వేత కమిషనరేట్‌పై పట్టు బిగించారు. సీపీగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే మెజార్టీ పోలీస్‌ స్టేషన్లను విజిట్‌ చేసి పోలీసులు, అధికారులతో మాట్లాడి యోగక్షేమాలు, శాంతిభద్రతలపై ఆరా తీశారు. సబ్‌డివిజన్లు, పోలీస్‌ స్టేషన్ల వారీగా నేరాల నమోదు, పరిశోధన, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న ఆమె నేరుగా బాధితులతో మాట్లాడుతున్నారు. డ్రగ్స్‌ నియంత్రణకు మహిళా సంఘాల సమన్వయంతో ‘సంఘమిత్ర’ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌, మోసాలు, రోడ్డు ప్రమాదాలు, డ్రంకెన్‌డ్రైవ్‌, సైబర్‌క్రైంలపై విద్యాలయాలు, పౌరులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు అధికారుల పని తీరుపైనా ఎప్పటికప్పుడు గ్రేడింగ్‌ చేస్తున్నారు. బదిలీలు, పనిష్‌మెంట్లతో కట్టుదాటితే ఎవరిపైన అయినా చర్యలు తప్పవన్న సంకేతాలు ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement