‘గ్రేటర్‌ వరంగల్‌’ రుణవేట | - | Sakshi
Sakshi News home page

‘గ్రేటర్‌ వరంగల్‌’ రుణవేట

Oct 13 2026 1:17 AM | Updated on Oct 13 2026 1:17 AM

‘గ్రేటర్‌ వరంగల్‌’ రుణవేట – IIలోu

వరంగల్‌లో ఆపరేషన్‌ చెబుత్రా
గ్రేటర్‌ వరంగల్‌ మహానగరంలో నేరాల నియంత్రణకు ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారు జాము వరకు విస్తృత తనిఖీలు నిర్వహించారు.
వాతావరణం
జిల్లాలో ఉదయం మంచుకురుస్తుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాత్రి చల్లగాలులు వీస్తాయి.

వరంగల్‌ అర్బన్‌: గ్రేటర్‌ వరంగల్‌ నగర అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో నిధులు అందుబాటులో లేక బల్దియా అధికారులు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈనేపథ్యంలో కొన్నేళ్లుగా ఎదురు చేస్తున్న మున్సిపల్‌ బాండ్ల ద్వారా నిధుల సేకరణకు రాష్ట్ర పురపాలక శాఖ అడినిస్ట్రేషన్‌ కార్యదర్శి, సీడీఎంఏ డాక్టర్‌ టీకే శ్రీదేవి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో సీడీఎంఏ కార్యాలయంలో టీకే.శ్రీదేవితో జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి.వెంకన్న, అకౌంట్స్‌ అధికారి శివలింగం, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, అకౌంట్స్‌ అధికారులతో కలిసి మున్సిపల్‌ బాండ్ల ద్వారా నిధుల సమీకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మున్సిపల్‌ బాండ్ల జారీకి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక, నిధుల సమీకరణ విధానాలు, స్థానిక సంస్థల ఆర్థిక స్వావలంబన, నగర మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు.

నాలుగేళ్ల క్ర అర్హత

గ్రేటర్‌ వరంగల్‌కు 2022లో ఇండియా రేటింగ్‌ సంస్థ జాతీయ స్థాయిలో స్థిరత్వం (–ఎ) రేటింగ్‌ ఇచ్చింది. దీంతో అప్పట్లో రూ.100 కోట్ల రుణ అర్హత సాధించింది. అదే ఏడాది నవంబరులో దీనిపై కౌన్సిల్‌ తీర్మానించి ప్రభుత్వానికి నివేదించింది. కానీ, పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం రేటింగ్‌ ప్రకారం రూ.180 కోట్ల మేరకు రుణాన్ని తీసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నగరంలో మౌలిక వసతుల కల్పన, పరిపాలన నిర్వహణకు అయ్యే వ్యయం, వివిధ ఆర్థిక వనరుల ద్వారా వచ్చే ఆదాయానికి ఎక్కడా పొంతన కుదరట్లేదు. ఆ దిశగా సంస్కరణలు చేపట్టడంలో బల్దియా అధికార యంత్రాంగం అడుగడునా విఫలమవుతోంది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నామమాత్రంగా నిధులు మంజూరవుతున్నాయి. ఈనేపథ్యంలో బాండ్ల ద్వారా రుణాలు సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు.

అర్హత సాధించాం..

మున్సిపల్‌ బాండ్ల జారీకి గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అర్హత కలిగి ఉంది. మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తాం. బాండ్ల ద్వారా నిధులను సమీకరించి నగరంలో మౌలిక సదుపాయాలను మరింత విస్తరించడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందిస్తాం.

– వెంకన్న, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌

మున్సిపల్‌ బాండ్లతో

రూ.180 కోట్ల రుణ అర్హత

గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సీడీఎంఏ

టీకే శ్రీదేవి

హైదరాబాద్‌లో జరిగిన

సమావేశంలో నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement