హన్మకొండ: శీతాకాలం వచ్చినా ఎల్నినో ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీనికితోడు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాగు కోసం భూగర్భ జలాలు తోడేందుకు విద్యుత్ వినియోగం పెరిగింది. దీనికి తోడు గృహాలు, వ్యాపార వాణిజ్యసంస్థలు, పరిశ్రమల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోత భరించలేక కూలర్లు, ఏసీల వినియోగం కొనసాగుతోంది. దీంతో గతేడాదితో పోలిస్తే ఈసారి విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. ఈ క్రమంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ డిమాండ్ నిలకడగా కాకుండా రోజూ పెరుగుతూ రికార్డులు బ్రేక్ చేస్తోంది. టీజీ ఎన్పీడీసీఎల్లో అధికశాతం వ్యవసాయానికి, గృహ అవసరాలు, వ్యాపార వాణిజ్య అవసరాలు, చిన్న చిన్న పరిశ్రమలకు విద్యుత్ వినియోగిస్తారు. భారీ పరిశ్రమలు పెద్దగా లేవు. అయినా విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. సెప్టెంబర్ 9న వేసవిని మించి రికార్డు స్థాయిలో 6,948 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. అంతకు ముందు మార్చి 27న నమోదైన 6,574 మెగావాట్ల డిమాండ్ అత్యధికం. దీన్ని బ్రేక్ చేస్తూ సెప్టెంబర్ 9న రికార్డు స్థాయిలో డిమాండ్ నమోదైంది. రాష్ట్రంలో గరిష్టంగా 19,543 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. మార్చిలో అత్యధికంగా నమోదైన 18,548 మెగావాట్ల డిమాండ్ను అధిగమించి ఇప్పుడు ఆల్టైం రికార్డు నమోదైంది.
వ్యవసాయ మోటార్లు ఆన్..
ప్రస్తుత వర్షాకాలమైనా చినుకు జాడలేదు. పంటలు పూర్తిగా భూగర్భజలాలపై ఆధారపడి సాగు చేశారు. భూగర్భజలాలు తోడి వరితో పాటు మెట్ట పంటలకు తడులు ఇస్తున్నారు. ఆరుతడి పంటలకు నీరు అవసరం కావడంతో వ్యవసాయ అవసరాలకు విద్యుత్ వినియోగం పెరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ వానా కాలంలో అన్ని పంటలు కలిపి 14,48,052 ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో వరి 6,91,997 ఎకరాలు, మొక్కజొన్న 1,00,976, పత్తి 7,99,799 ఎకరాల్లో సాగు చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో..
ఉమ్మడి జిల్లాలో విద్యుత్ డిమాండ్ ఈ నెల 6న 2,012 మెగావాట్లు, 7న 2,022, 8న 2,017, 9న 2,025, 10న 2,106, 11న 2,072 మెగావాట్లకు చేరుకుంది. గతేడాది అక్టోబర్ 6న 939 మెగావా ట్లు, 7న 1,026, 8న 1,206, 8న 1,364, 9న 1,269, ఈ నెల 11న 1,333 మె గావాట్ల డిమాండ్ నమోదైంది. విద్యుత్ వినియోగం చూస్తే ఈ నెల 6న 25.135, 7న 24.222, 8న 25.785, 9న 25.267, 10న 25.769, ఈ నెల 11న 28.552 మిలి యన్ యూనిట్లు వాడారు. గతేడాది అక్టోబర్ 6న 13.551 మిలియన్ యూనిట్లు, 7న 15.152. 8న 17.191, 9న 18.062, 10న 18.932, 11వ తేదీన 18.323 మిలియన్ యూనిట్లుగా నమోదైంది.
2072
మెగావాట్లు
ప్రస్తుతం
గతేడాది
విద్యుత్ డిమాండ్
18.932
మిలియన్ యూనిట్లు
28.552
మిలియన్ యూనిట్లు
పెరిగిన ఏసీలు, కూలర్ల వినియోగం
గిరగిరా తిరుగుతున్న మీటర్లు


