ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరి

Apr 9 2026 7:17 AM | Updated on Apr 9 2026 7:17 AM

కేయూ క్యాంపస్‌: యూనివర్సిటీలో బోధన, బోధనేతర ఉద్యోగులకు ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరిగా చేశామని, ఇక నుంచి వేతానాల చెల్లింపుతో ముఖగుర్తింపు హాజరు అనుసంధానం చేయబోతున్నామని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీలోని సెనెట్‌హాల్‌లో యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, వివిధ విభాగా ల డీన్లు, విభాగాల అధిపతులు, బోర్డు ఆఫ్‌ స్డడీస్‌ చైర్మన్లతో నిర్వహించిన అవగాహన సమావేశంలో ప్రతాప్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అధ్యాపకులు, నాన్‌టీచింగ్‌ ఉద్యోగులకు సెలవుల మంజూరు అధికారం ప్రిన్సిపాళ్లకు ఉంటుందన్నా రు. ప్రతీ అధ్యాపకుడు, ఉద్యోగి నిర్దేశించిన సమయం ప్రకారం క్యాంపస్‌లో ఉండేల్సిందేనని స్పష్టం చేశారు.రాబోయే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు కూడా ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని అమలుచేయబోతున్నామని వెల్లడించారు. రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం మాట్లాడుతూ ఏప్రిల్‌ నుంచి లీవ్‌ల నిర్వహణను పూర్తిగాముఖ గుర్తింపు హాజరువిధానం ద్వారానే చేపడుతామన్నారు. ప్రారంభ దశలో వచ్చే సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తామన్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం అధిపతి రమ మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రాంగణంలో వివిధ ప్రాంతాల్లో పది పరికరా లను ఏర్పాటుచేశామన్నారు. విభాగాల్లో మొబైల్‌ ఆధారిత అప్లికేషన్స్‌ అమలు చేసినట్లు తెలిపారు. త్వరలోనే పార్ట్‌టైం అధ్యాపకుల నమోదు ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుందన్నారు.

కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement