ఎండను ఎదుర్కొందామిలా.. | - | Sakshi
Sakshi News home page

ఎండను ఎదుర్కొందామిలా..

Apr 8 2026 8:26 AM | Updated on Apr 8 2026 8:26 AM

ఎండను ఎదుర్కొందామిలా..

హన్మకొండ అర్బన్‌: ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటుతున్నాయి. ఎండల ధాటికి పిల్లలు, వృద్ధులు తట్టుకోలేకపోతున్నారు. చాలా మంది వడదెబ్బ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎండను దీటుగా ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు వైద్యులు. ఆ వివరాలే ‘సాక్షి’ ప్రత్యేకం..

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

● తెల్లటి లేదా లేత రంగు దుస్తులు ధరించాలి. తలకు గుడ్డ, టోపీ లేదా హెల్మెట్‌ ధరించాలి. బయటకు వెళ్లే ముందు నీళ్లు తాగాలి. ఖాళీ కడుపుతో బయటకు వెళ్లకూడదు. ఉదయం11 నుంచి 4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడమే మంచిది. అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే నీళ్ల బాటిల్‌ వెంట తీసుకెళ్లాలి.

● దాహం వేయకపోయినా నీళ్లు తాగుతూ ఉండాలి. ఎక్కువగా చెమట పడితే ఉప్పు, పంచదార కలిపిన ద్రావణం లేదా మజ్జిగ తీసుకోవాలి. బస్సులు, బైక్‌లపై ఎక్కువసేపు ప్రయాణించొంద్దు. తల నేరుగా ఎండలో ఉండకుండా జాగ్రత్తపడాలి.

● సాధారణంగా 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగాలి, బయట పని చేసే వారు 4 నుంచి 5 లీటర్ల వరకు తీసుకోవాలి. పిల్లలకు తరచూ కొద్దికొద్దిగా నీళ్లు ఇస్తూ ఉండాలి. ఒక్కసారిగా ఎక్కువగా తాగకుండా మధ్య మధ్యలో తాగాలి.

● పెరుగు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, పుచ్చకాయ, కర్బూజ, దోస వంటి తేలికైనవి తీసుకోవాలి.

● వేపుడు పదార్థాలు, మసాలా ఆహారం, మద్యపాన పదార్థాలు, గ్యాస్‌ పానీయాలకు దూరంగా ఉండాలి.

డీహైడ్రేషన్‌, వడదెబ్బ లక్షణాలు

నోరు ఎండిపోవడం, తల నిర్భంధం, బలహీనత, అలసట మూత్రం గాఢంగా రావడం. శరీరం చాలా వేడిగా ఉండడం, చెమట తగ్గిపోవడం, తలనొప్పి, వాంతులు, స్పృహ కోల్పోవడం

తక్షణ చర్యలు

వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలి. తడి గుడ్డతో శరీరాన్ని తుడవాలి. నీరు లేదా ఉప్పు, పంచదార కలిపిన ద్రావణం ఇవ్వాలి. పరిస్థితి తీవ్రమైతే ఆస్పత్రికి తీసుకెళ్లాలి.

బయట నుంచి వచ్చిన తర్వాత..

వెంటనే చల్లని నీళ్లు తాగకూడదు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత నీళ్లు తాగాలి. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి.

ఉష్ణోగ్రత పెరిగితే ప్రమాదమే

● 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్‌ వరకు సాధారణంగా భరించగల స్థాయి, ఎక్కువగా ఇబ్బందులు ఉండవు. కానీ, నీళ్లు తాగకపోతే అలసట, చెమట ఎక్కువగా వస్తుంది.

● 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్‌ వరకు మోస్తరు ప్రమాద స్థాయి, తలనొప్పి, అలసట, చెమట ఎక్కువగా రావడం ఎక్కువసేపు ఎండలో ఉంటే బలహీనత అనిపిస్తుంది.

● 38 నుండి 40 డిగ్రీల సెల్సియస్‌ వరకు అధిక ప్రమాద స్థాయి, తల తిరగడం, నీరసం, వాంతులు వచ్చే అవకాశం, హీట్‌ ఎగ్జాషన్‌ లక్షణాలు కనిపిస్తాయి. బయట ఎక్కువసేపు ఉండడం ప్రమాదకరం

● 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్‌ వరకు ప్రమాదకర స్థాయి, వడదెబ్బ వచ్చే అవకాశం ఎక్కువ.

● శరీరం వేడి పెరగడం, చెమట తగ్గిపోవడం తక్షణ జాగ్రత్తలు అవసరం

● 42 డిగ్రీల సెల్సియస్‌కు పైగా అత్యంత ప్రమాదకర స్థాయి. శరీరం తట్టుకోలేని పరిస్థితి స్పృహ కోల్పోవడం, ప్రాణాపాయం వరకు వెళ్లే అవకాశం. తప్పనిసరి అయితేనే బయటకు వెళ్లాలి.

ముందు జాగ్రత్త అవసరం..

వేసవిలో వడదెబ్బకు గురై ఇబ్బందులు పడేకంటే ముందు జాగ్రత్తలు పాటిస్తే ఎండదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి సరిపడా నీరు తీసుకోవడం అవసరం. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా ఉండాలి. ఒకవేళ వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స పొందాలి. ఆలస్యం చేస్తే పరిస్థితి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది.

– డాక్టర్‌ టి సనత్‌ కుమార్‌, ఎండీ ఫిజీషియన్‌, మనీష క్లినిక్‌, బాలసముద్రం

డిగ్రీలు

(సెల్సియస్‌లలో)

39

38

37

37

37

37

35

36

పిల్లలు, వృద్ధులు రక్షణ చర్యలు

పాటించాలి

ముందస్తు జాగ్రత్తలతో

డీహైడ్రేషన్‌కు చెక్‌

తేదీ 8 7 6 5 4 3 2

1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement