‘బూత్‌ లెవెల్‌’ కసరత్తు! | - | Sakshi
Sakshi News home page

‘బూత్‌ లెవెల్‌’ కసరత్తు!

Apr 8 2026 8:26 AM | Updated on Apr 8 2026 8:26 AM

‘బూత్‌ లెవెల్‌’ కసరత్తు!

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

గ్రామ స్థాయి నుంచి బూత్‌ స్థాయి వరకు కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏ) నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతీ బూత్‌కు ప్రత్యేక ఏజెంట్లను ఎంపిక చేస్తూనే.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ కేడర్‌ను యాక్టివ్‌ చేయడంపై దృష్టి సారించింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీ కేడర్‌ ప్రజల్లోకి వెళ్లేలా బూత్‌స్థాయి కమిటీలను ఆచితూచి నియమిస్తోంది. ఇందుకోసం.. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్లను ఉమ్మడి వరంగల్‌లోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న సీనియర్లకు ఇతర జిల్లాల ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగిస్తూ టీపీసీసీ చీఫ్‌ బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

కీలకంగా బీఎల్‌ఏలు..

రాబోయే ఎన్నికల్లో బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు కీలకంగా వ్యవహరించేలా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు కమిటీలు వేయాల్సి ఉంది. ప్రతీ బూత్‌కు 10–15 మంది యాక్టివ్‌ టీమ్‌తో బూత్‌ లెవెల్‌ ఏజెంట్లను ఎంపిక చేయాలనేది పార్టీ అధిష్టానం ఆదేశాలు. ఎంపికై న బీఎల్‌ఏలు ఓటర్‌ లిస్ట్‌ వెరిఫికేషన్‌, డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌ చేసేలా చూడాలి. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ ప్రతీ బూత్‌ను టార్గెట్‌గా తీసుకుని పనిచేస్తోంది. స్థానికంగా ప్రభావం ఉన్న యువకులు, సీనియర్‌ కార్యకర్తలను ఎంపిక చేసి.. ఓటర్లతో నేరుగా సంబంధాలు పెంచేలా బాధ్యతలు అప్పగించనున్నారు. ఓటర్‌ లిస్ట్‌లో లోపాల గుర్తింపు, సరిదిద్దే పనితో పాటు ‘బూత్‌ గెలిస్తేనే సీటు గెలుస్తాం’ అనే స్ట్రాటజీతో ముందుకెళ్లాలన్న పార్టీ అధిష్టానం సూచనల మేరకు అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లు కేడర్‌కు మార్గనిర్దేశనం చేస్తున్నారు. బీఎల్‌ఏలు ప్రభుత్వ పథకాలు, పార్టీ హామీలపై అవగాహన, అసంతృప్త వర్గాలపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు కేడర్‌కు సంకేతాలిచ్చారు. ఈనేపథ్యంలో బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల కోసం కూడా పోటీ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

12 సెగ్మెంట్లకు ఇన్‌చార్జ్‌లు వీరే..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరంగల్‌, మహబూబాబాద్‌, భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధి 12 సెగ్మెంట్లకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. జనగామకు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తికి దుద్దిళ్ల శ్రీనివాస్‌, పరకాల, వరంగల్‌ పశ్చిమకు పల్లె శ్రీనివాస్‌గౌడ్‌కు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేటకు మోతుకూరి ధర్మారావు, భూపాలపల్లి, ఎండీజావేద్‌ (ఆర్‌జీపీఆర్‌ఎస్‌), డోర్నకల్‌, మహబూబాబాద్‌కు ఎండీ.అవేజ్‌, నర్సంపేట, ములుగుకు నాగ సీతారాములును అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. అదేవిధంగా జిల్లాకు చెందిన నాయకులు జంగా రాఘవరెడ్డికి నల్లగొండ, ఈవీ.శ్రీనివాస్‌రావుకు భువనగిరి, గాజర్ల అశోక్‌కు భద్రాచలం, కూచన రవళిరెడ్డికి పినపాక, ఇల్లందు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు.

‘సంస్థాగతం’పై కాంగ్రెస్‌ ఫోకస్‌

బూత్‌ స్థాయి కమిటీలపై గురి

12 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్‌చార్జ్‌లు

ఇతర జిల్లాలకు పార్టీ సీనియర్లు

నియామక ఉత్తర్వులు జారీ చేసిన

టీపీసీసీ చీఫ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement