జవాబుదారీతనమేది? | - | Sakshi
Sakshi News home page

జవాబుదారీతనమేది?

Apr 9 2026 8:17 AM | Updated on Apr 9 2026 8:17 AM

జవాబుదారీతనమేది?

‘బల్దియా’ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యం

వరంగల్‌ అర్బన్‌: గ్రేటర్‌ వరంగల్‌ పరిపాలనలో పారదర్శకత లోపించిందనే వాదనలు వినిపిస్తున్నా యి. అభివృద్ధి పనులు, నిధులు, ప్రాజెక్టులు, వాటి రూపకల్పన, పౌర సేవలు అన్ని అంశాల్లో సిబ్బంది, అధికారులు అంతాగోప్యం వహిస్తున్నారనే ఆరో పణలున్నాయి. పౌరులెవరైనా రెండు అంతస్తుల భవనాలు ఎక్కి దిగినా అధికారుల జాడ కనిపించట్లేదని ఒకవేళ ఏదైనా సమాచారం అడిగినా ఇవ్వ డం లేదనే ఆరోపణలులు వెల్లువెత్తుతున్నాయి.

సేవల్లో జాప్యం!

బల్దియా కార్యాలయంలో సమయానికి పౌర సేవలు అందట్లేదని గ్రేటర్‌ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధికారులు, ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జవాబుదారీతనం కరువైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కీలక పథకాలు, అభివృద్ది పనులను, పౌర సేవలను పర్యవేక్షించాల్సిన మహా నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మేయర్‌ గుండు సుధారాణి, ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆయా విభాగాల పనితీరును మెరుగుపర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు నామమాత్రంగా మారాయని, మితీమీరిన రాజకీయ జోక్యం కారణంగా జవాబుదారీతనం, నగరాభివృద్ధి కుంటుపడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పూర్తి స్థాయి కమిషనర్‌ లేకనా?

అదనపు బాధ్యతలే కారణమా?

బల్దియా ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చాహత్‌ బాజ్‌పాయ్‌ ఓ వైపు హనుమకొండ కలెక్టర్‌గా, ‘కుడా’ చైర్‌పర్సన్‌, జిల్లా పరిషత్‌ సీఈఓ, డీసీసీ బ్యాంక్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదనపు బాధ్యతల కారణంగా బల్దియా పాలనా వ్యవహారాలపై తనదైన ముద్ర చూపలేకపోతున్నారనే అభిప్రాయం ప్రజల నుంచి వినిపిస్తోంది. కాగా, గ్రేటర్‌ వరంగల్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన విధులకు కృషి చేయాల్సిన మేయర్‌ అభివృద్ధి పరంగా తన మార్కును చూపించాలన్న పట్టుదలతో ఉండగా.. అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

దరఖాస్తులు బుట్టదాఖలు

ప్రజలకు అందుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్‌లో చేపట్టబోయే పనులు, కాంట్రాక్టర్ల చెల్లింపులు, వాటి విలువలు, పని చేస్తున్న సిబ్బంది జీతభత్యాలు, బడ్జెట్‌ వివరాలు, నిధుల సమీకరణ, పన్ను బకాయిలు, రుణాలు, ఏ అధికారులు అనుమతులు ఇస్తారు. ఇలా 24 అంశాలను ప్రజలకు బహిరంగ పర్చాల్సిన బాధ్యత కార్పొరేషన్‌ అధికారులపై ఉంది. కానీ, బల్దియాలో అవి హుష్‌ కాకిగా మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద కోరినప్పటికీ దరఖాస్తులను చెత్తబుట్టలో వేస్తున్నట్లు, సమాచారాన్ని ఇవ్వడం లేదని నగర పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌లో రోడ్లపై ఆక్రమణలు, కట్టడాలు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఇలా ఎన్ని ఫిర్యాదులు నమోదైనా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కాగా, పరిపాలనా వ్యవహారాలపై ‘సాక్షి’ అడిషనల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ను వివరణ కొరగా.. అన్నీ సవ్యంగా సాగుతున్నాయని దాటవేయడం గమనార్హం.

ఏ సమాచారం అడిగినా ఇవ్వరు!

ఎన్నిసార్లు తిరిగినా పని అవ్వట్లేదని ప్రజల విస్మయం

పూర్తి స్థాయి కమిషనర్‌ లేక

కుంటుపడిన పాలన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement