నిరవధిక సమ్మెలోకి ఆర్టిజన్‌ ఉద్యోగులు | - | Sakshi
Sakshi News home page

నిరవధిక సమ్మెలోకి ఆర్టిజన్‌ ఉద్యోగులు

Apr 9 2026 8:17 AM | Updated on Apr 9 2026 8:17 AM

నిరవధిక సమ్మెలోకి ఆర్టిజన్‌ ఉద్యోగులు

హన్మకొండ: విద్యుత్‌ ఆర్టిజన్‌ ఉద్యోగులు, అన్‌మ్యాన్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్లు నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. దాదాపు పూర్తి స్థాయిగా ఆర్టిజన్‌ ఉద్యోగులు, అన్‌మ్యాన్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్లు బుధవారం విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యమ్నాయ ఏర్పాటు చేశారు. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ఉద్యోగులను సబ్‌స్టేషన్ల వారీగా విధులు కేటాయించారు. విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్‌ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో సబ్‌ స్టేషన్ల నిర్వహణను ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌ ఉద్యోగులు చూసుకుంటున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్‌ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జెన్‌ కో, ట్రాన్స్‌కో, డిస్కంలలో పని చేస్తున్న ఆర్టిజన్‌ ఉద్యోగులు, అన్‌మ్యాన్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్లు సమ్మెకు దిగారు. టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలో 1,382 మంది అన్‌మ్యాన్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్లు, 3,457 మంది ఆర్టిజన్‌ ఉద్యోగులున్నారు. వీరిలో కొందరు మినహా దాదాపుగా అందరు సమ్మెకు దిగారు. సర్కిల్‌, డివిజన్‌ కార్యాలయాల వద్ద సమ్మె శిబిరం నిర్వహించి నిరసన తెలిపారు.

వర్కర్ల కొరత..

ఆర్టిజన్‌ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో సబ్‌ స్టేషన్లలో ఆపరేటర్ల కొరత, అన్‌మ్యాన్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్లు విధులకు దూరంగా ఉండడంతో క్షేత్ర స్థాయిలో పని చేసేందుకు వర్కర్ల కొరత నెలకొంది. ఈ తరుణంలో ఈదురుగాలు, ప్రకృతి విపత్తులు తలెత్తి విద్యుత్‌ లైన్లలో సమస్యలు తలెత్తితే అంధఃకారం తప్పదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌ ఉద్యోగులు సబ్‌ స్టేషన్లలో ఆపరేటర్ల బాధ్యతలు నిర్వహించడానికి సరిపోతున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో ఏదైనా సమస్య ఏర్పడితే పని చేయడానికి అందుబాటులో ఎవరూ లేరు. ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌ ఉద్యోగులు అందుబాటులో ఉన్న సమయంలోనూ విద్యుత్‌ స్తంభాలు ఎక్కి చక్కదిద్దే పనులు ఆన్‌మ్యాన్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్లు చేసేవారు. ప్రస్తుతం వీరు సమ్మెలోకి వెళ్లడంతో సమస్య జఠిలంగా మారనుంది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన

అధికారులు

టీజీ ఎన్పీడీసీఎల్‌ ఆర్టిజన్‌

ఉద్యోగులు 3,457

అన్‌మ్యాన్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్లు

1,382 మంది

సమ్మె కొనసాగితే ఇబ్బందులే..

ఈదులు గాలులు, ప్రకృతి వైపరీత్యాలు తలెత్తితే అంధకారమే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement