టెన్త్‌లో ఉత్తీర్ణత శాతం పెంచాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలో టెన్త్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషిచేయాలని కలెక్టర్ సత్యశారద ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. డీఈఓ రంగయ్యనాయుడు అధ్యక్షతన గురువారం కలెక్టరేట్‌లో ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎఫ్‌ఆర్‌ఎస్ తప్పనిసరిగా అమలు చేయాలని, విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు సంబంధించిన 288 పాఠశాలల్లో చదువుతున్న 9,492 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు.
పీఎంశ్రీ స్కూళ్లలో పనులు పూర్తి చేయాలి..
జిల్లాలో 16 పీఎంశ్రీ స్కూళ్లలో ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌ను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాలని హెచ్‌ఎంలను ఆదేశించారు. పనులు పూర్తిచేయాలని టీడబ్ల్యూఈఐడీసీ ఈఈ అరుణ్‌కుమార్‌కు సూచించారు. డీఆర్‌ఓ విజయలక్ష్మి, వరంగల్ ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి గారె కృష్ణమూర్తి, ఏఎంఓ ఉండ్రాతి సుజన్‌తేజ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ అరుణ, జీసీడీఓ ఫ్లోరెన్స్, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ కట్ల శ్రీనివాస్, ప్లానింగ్ ఆఫీసర్స్ విజయ్‌కుమార్, వేణుగోపాల్ పాల్గొన్నారు.
మిర్చి రైతులకు అవగాహన కల్పించాలి..
న్యూశాయంపేట: మిర్చి నాణ్యతపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. మిర్చి సీజన్ ప్రారంభ నేపథ్యంలో ఏనుమాముల మార్కెట్ యార్డులో మిర్చి రాబడులు, నాణ్యత, ధరల పరిస్థితిపై గురువారం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఏఓ అనురాధ, హార్టికల్చర్ అధికారి శ్రీనివాస్‌రావు, మార్కెటింగ్ అధికారి సురేఖ, మార్కెట్ కమిటీ కార్యదర్శి మల్లేశం, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు రవీందర్‌రెడ్డి, వేద ప్రకాశ్, సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.


