మొక్కజొన్న జోరు.. | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న జోరు..

Feb 19 2026 10:07 AM | Updated on Feb 19 2026 10:07 AM

మొక్కజొన్న జోరు..

మొక్కజొన్న జోరు..

హన్మకొండ: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొక్కజొన్న పంట జోరుగా సాగవుతోంది. గతంతో చూసుకుంటే ఈ యాసంగిలో విస్తీర్ణం పెరిగింది. వర్షాలు బాగా కురవడంతో సాగుకు నీరు సమృద్ధిగా ఉంది. దీంతోపాటు ఈ ఏడాది భారీ వర్షాలకు పత్తిలో దిగుబడి తగ్గింది. మరో వైపు గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశం ఉండడంతో ఈ సారి పత్తి పంటను ముందే తొలగించారు. డిసెంబర్‌ వరకు పత్తిని కొనసాగించే రైతులు.. ఈసారి అక్టోబర్‌ చివరి నుంచి తొలగించారు. ఆ పంటలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు మొక్కజొన్న సాగు వైపు దృష్టి మళ్లించారు. వరికి ముందే మొక్కజొన్న సాగు చేయడంతో వరికి నీటి సమస్య ఉండదని, వరికి అధిక సాగు నీరు అవసరమయ్యే నాటికి మొక్కజొన్న పంట చేతికి వస్తుందని, ఇది కూడా ఆ పంట విస్తీర్ణం పెరగడానికి కారణమని వ్యవసాయ అధికారులు తెలిపారు.

గతం కంటే పెరిగిన సాగు..

మొక్కజొన్న సాగు గతం కంటే పెరిగింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అన్ని పంటలు కలిపి సాధారణ సాగు విస్తీర్ణం 8,99,861 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 9,55,387 ఎకరాల్లో సాగైంది. గతేడాది 8,20,945 ఎకరాల్లో సాగైంది. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 2,23,259 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 3,37,394 ఎకరాల్లో సాగైంది. గతేడాది యాసంగిలో 2,32,145 ఎకరాల్లో సాగైంది. గతేడాదితో చూసుకున్న...సాధారణ విస్తీర్ణంతో చూసినా ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణ విస్తీర్ణంతో చూసుకుంటే అదనంగా 1,14,135 ఎకరాలు, గతేడాదితో చూసుకుంటే 1,14,135 ఎకరాలు సాగైంది. వరి ఉమ్మడి జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 6,48,804 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 6,10,215 ఎ కరాల్లో సాగైంది. గతేడాది 5,77,628 ఎకరాల్లో సాగైంది. కాగా, యాసంగి సాగు ఇంకా కొనసాగుతోంది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో

ఈ యాసంగిలో పెరిగిన పంట విస్తీర్ణం

ఇప్పటి వరకు 3,37,394 ఎకరాల్లో సాగు.. గతేడాది 2,37,145 ఎకరాల్లోనే..

వరి ఇప్పటి వరకు 6,10,215 ఎకరాల్లో సాగు..గతేడాది 5,77,628 ఎకరాల్లో..

అన్ని పంటలు కలిపి ఇప్పటి వరకు 9,55,387 ఎకరాల్లో సాగు

గతేడాది మొత్తం సాగైంది 8,20,945 ఎకరాలు..

జిల్లాల వారీగా పంటల సాగు వివరాలు (ఎకరాల్లో)

జిల్లా సాధారణ సాగైంది గతేడాది సాగు

వరంగల్‌ 1,90,766 1,91,564 1,98,036

హనుమకొండ 1,79,574 1,63,982 1,71,174

మహబూబాబాద్‌ 1,89,010 2,13,665 1,59,737

ములుగు 55,240 61,745 36,669

జేఎస్‌ భూపాలపల్లి 96,919 1,17,078 79,499

జనగామ 1,88,352 2,07,353 1,75,830

మొక్క జొన్న సాగు వివరాలు (ఎకరాల్లో)

జిల్లా సాధారణ సాగైంది గతేడాది సాగు

వరంగల్‌ 90,559 1,01,162 1,02,321

హనుమకొండ 56,062 65,262 57,498

మహబూబాబాద్‌ 41,588 1,02,974 42,045

ములుగు 6,068 13,329 4,326

జేఎస్‌ భూపాలపల్లి 18,369 28,017 13,625

జనగామ 10,613 26,650 12,330

వరి సాగు వివరాలు (ఎకరాల్లో)

జిల్లా సాధారణ సాగైంది గతేడాది సాగు

వరంగల్‌ 96,414 90,012 94,104

హనుమకొండ 1,21,165 98,065 1,13,070

మహబాబాద్‌ 1,34,564 1,07,617 1,13,934

ములుగు 46,182 46,420 31,320

జేఎస్‌ భూపాలపల్లి 77,439 89,000 65,750

జనగామ 1,73,040 1,79,010 1,59,450

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement