జేఈఈ మెయిన్స్‌లో ట్రైబల్ వెల్ఫేర్ స్టడీ సర్కిల్ సత్త
● పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని ట్రైబల్ వెల్ఫేర్ స్టడీ సర్కిల్‌లో కోచింగ్ తీసుకున్న 28 మంది విద్యార్థుల్లో 15 మంది జేఈఈ మెయి న్స్‌లో సత్తా చాటారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. హనుమకొండలోని ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ స్టడీ సర్కిల్‌కు సంబంధించి ఎస్‌టీఈఎ–60 పేరుతో రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను బుధవారం విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్టీ బాలబాలికలకు(బ్యాచ్) జేఈఈ, నీట్ పరీక్షల కోసం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఆగస్టు నుంచి కోచింగ్ ప్రారంభిస్తామన్నారు. పరీక్ష ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తామన్నారు. మొదటి సంవత్సరమే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇతర జేఈఈ కోచింగ్ సెంటర్ల కన్నా ఈ సెంటర్‌లో అత్యధిక ఫలితాలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో శ్రీరాములు, సారయ్య దొర పాల్గొన్నారు.
జేఈఈ మెయిన్స్‌లో ట్రైబల్ వెల్ఫేర్ స్టడీ సర్కిల్ సత్త


