
ఆర్టీసీ ఉద్యోగుల స్థానిక సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల స్థానిక సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి వీఎస్.రావు డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ రాంనగర్‌లోని సుందరయ్య భవన్‌లో ఫెడరేషన్ కరీంనగర్ జోనల్ స్థాయి సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాట కార్యక్రమాన్ని తీసుకోనున్నట్లు తెలిపారు. యాజమాన్యం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ప్రధానంగా విద్యుత్ బస్సుల కొనుగోళ్లను సంస్థకే అప్పగించి సంస్థతోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్మికులపై పని భారం తగ్గించి ఖాళీలు భర్తీ చేయాలన్నారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవీందర్ రెడ్డి, సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ లింగమూర్తి, ఉపాధ్యక్షుడు సి.హెచ్.రామచంద్రం, నాయకులు ఎల్లయ్య, ఉపేంద్రాచారి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
● స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్.రావు