
యువకుడి అనుమానాస్పద మృతి
కాజీపేట: కాజీపేట 63వ డివిజన్ విష్ణుపురి కాలనీలో స్నేహితుడి ఇంటికి వచ్చిన ఓ యువకుడు గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ కరీమాబాద్‌కు చెందిన ఆర్టీసీ డిపో మేనేజర్ తిరుమలగిరి శ్రీనివాస్ కుమారుడు రుషికేశ్ (22) బీటెక్ పూర్తిచేసి హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజులుగా కాజీపేటలో ఉంటున్న స్నేహితుడు కొండా హర్షిత్ ఇంటి వద్ద ఉంటున్నాడు. కాగా, రుషికేశ్ మంచంపై నిద్రపోయాడు. కొద్దిసేపటి తర్వాత హర్షిత్ చూడగా కిందపడి కనిపించడంతో కుటుంబీకులను అప్రమత్తం చేసి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై నవీన్‌కుమార్ ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరిపారు. రుషికేశ్ మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపర్చినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు.