
సృజనాత్మకతను వెలికి తీసేందుకే పోటీలు
విద్యారణ్యపురి: విద్యార్థుల్లోని సృజనాత్మకత ను వెలికితీసేందుకు సైన్స్ డ్రామా పోటీలు దో హదం చేస్తాయని జిల్లా విద్యాశాఖలోని క్వాలి టీ కో–ఆర్డినేటర్ బండారు మన్మోహన్ అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా సైన్స్ కేంద్రంలో జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు ముగిశాయి. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈపోటీల్లో ‘హైజీన్ ఫర్ ఆల్ అందరి కోసం పరిశుభ్రత’ అంశంపై శ్యాయంపేట తెలంగాణ బాలికల సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన డ్రామా రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి తెలిపారు. లయన్స్ క్లబ్ హనుమకొండ అధ్యక్షుడు టి.రమేశ్‌బాబు, బాధ్యులు ప్రభాకర్ పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ రంగస్థల, సినీ నటుడు బీటరవం శ్రీధరస్వామి, హిందీ స్కూల్ అసిస్టెంట్ చెడుపాక రాములు వ్యవహరించారు. ఈపోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
సహ చట్టంపై
గవర్నర్ సందేశం
న్యూశాయంపేట: సమాచార హక్కు చట్టం– 2005 అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూ ర్తయ్యింది. ఈ సందర్భంగా ఈనెల 5 నుంచి 12 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా గురువా రం హైదరాబాద్ రవీంద్రభారతి నుంచి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ వర్చువల్ సందేశం ఇచ్చారు. కలెక్టరేట్‌లో వరంగల్ కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొని వీక్షించారు. ఈ సందర్భంగా అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ జిల్లా కార్యాలయాల్లో పూర్తి ఆర్‌టీఐ సమాచారం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
నాటికలతో నైపుణ్యాల పెంపు
● వరంగల్ జిల్లా సైన్స్ అధికారి
డాక్టర్ కట్ల శ్రీనివాస్
కాళోజీ సెంటర్: నాటికలు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందిస్తాయని వరంగల్ జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ అన్నారు. దక్షిణ భారత సైన్స్ డ్రామా ఫెస్ట్‌వల్–2025లో భాగంగా జిల్లాస్థాయి సైన్స్ డ్రామా పోటీలు గురువారం మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. మట్టెవాడ ప్రభుత్వ ఉన్న త పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన పరిశుభ్రతే పరమాత్ముడు నాటిక ప్రథమ స్థానంలో నిలిచిందని, ఈనెల 17వ తేదీన హైదరాబాద్‌లోని ఎన్‌సీఆర్‌టీలో జరగనున్న రాష్ట్రస్థాయి సైన్స్ డ్రామా పోటీలకు జిల్లా తరఫున ఎంపికై ందని తెలిపారు. ఖిలా వరంగల్ ఆరెల్లి బుచ్చ య్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన స్మార్ట్ వ్యవసాయం ద్వితీయ స్థానం, రాయపర్తి మండలం కొలనుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన అందరికీ పరిశుభ్రత నాటిక తృతీయస్థానం సాధించింది. న్యాయనిర్ణేతలుగా రహమాన్, మాణిక్య రేఖ, డాక్టర్ స్వప్న, సురేశ్‌బా బు వ్యవహరించారు. విజేతలకు జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్, వరంగల్ ఎంఈ ఓ వెంకటేశ్వర్లు ప్రశంసపత్రాలు అందజేశారు. పాఠశాల హెచ్‌ఎం అరుణ, జి ల్లా సైన్స్ రిస్సో ర్స్ పర్సన్స్ కృష్ణంరాజు, సంతోష్, పరమేశ్వర్ పాల్గొన్నారు.

సృజనాత్మకతను వెలికి తీసేందుకే పోటీలు

సృజనాత్మకతను వెలికి తీసేందుకే పోటీలు

సృజనాత్మకతను వెలికి తీసేందుకే పోటీలు