శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

Oct 10 2025 8:00 AM | Updated on Oct 10 2025 8:02 AM

– IIలోu

న్యూస్‌రీల్‌

ఎంజీఎం : పది రోజులుగా జలుబు, గొంతునొప్పి, సీజనల్‌ విషజ్వరాలతో బాధపడుతూ వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఔట్‌ పేషెంట్ల సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతోంది. గత ఎనిమిది రోజుల్లో విషజ్వరాలతో బాధపడుతూ 440 మందికి పైగా ఇన్‌పేషెంట్లుగా అడ్మిట్‌ అయి చికిత్స పొందుతున్నారు. ఇందులో 23 మందికి డెంగీ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వీరు చికిత్స పొందుతున్నారు. 9 మంది మలేరియాతో బాధపడుతున్నారు. చిన్నారులను సైతం విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఆస్పత్రిలోని పిల్లల విభాగంలో ఈ సంఖ్య ఏమాత్రమూ తగ్గడం లేదు.

వణికిస్తున్న డెంగీ జ్వరాలు..

ఎంజీఎం ఆస్పత్రికి విష జ్వర పీడితులతోపాటు డెంగీ పాజిటివ్‌గా తేలిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతీరోజు ఇద్దరు, ముగ్గురికి పాజిటివ్‌ నమోదవుతుండడం..వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్‌ అవుతున్నారు. బాధితులకు అన్ని రకాల రక్తపరీక్షలతోపాటు మెరుగైన వైద్యచికిత్సలు అందిస్తున్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

రక్త పరీక్షలకు తప్పని తిప్పలు..

ఎంజీఎం ఆస్పత్రిలో అన్ని రకాల రక్త పరీక్షలు చేస్తున్నామని వైద్యాధికారులు పేర్కొంటున్నప్పటికీ కొన్నింటిని బయటకు పంపిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి అత్యసవర విభాగానికి దగ్గరలో ఉన్న ఓ డయాగ్నోస్టిక్‌ నిర్వాహకులు ఏకంగా ఆస్పత్రిలో కొంతమంది సిబ్బందితో అక్రమ దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్‌ సిబ్బంది ఏకంగా ఆస్పత్రి లోపలికి వచ్చి శాంపిళ్లు సేకరిస్తుండడం గమనార్హం.

డెంగీ బాధితులపై ప్రత్యేక దృష్టి

ఎంజీఎంలో జ్వర పీడితుల కోసం ప్ర త్యేక ఓపీ విభాగాన్ని ఏర్పాటు చేశాం. డెంగీ బాధితులపై ప్రత్యేక దృష్టి సారించి చికిత్స అందిస్తున్నాం. అన్ని రక్త పరీక్షలతోపాటు కావాల్సిన సంఖ్యలో ప్లేట్‌లెట్లు కూడా అందుబాటులో ఉంచాం.

– కిశోర్‌, ఎంజీఎం సూపరింటెండెంట్‌

ఎంజీఎం ఆస్పత్రికి పెరుగుతున్న విష జ్వరాల రోగులు

ఎనిమిది రోజులుగా ఎంజీఎంలో ఇన్‌పేషెంట్ల వివరాలు

ఈ ఫొటోలు చూడండి.. హనుమకొండ జిల్లా పరకాల సివిల్‌ ఆస్పత్రిలోని ఇన్‌పేషెంట్‌ వార్డు. సాధారణ రోజుల్లో ఆస్పత్రిలో 100 నుంచి 150 ఓపీ నమోదవుతుంది. కానీ, ఇటీవల విష జ్వరాలు విజృంభించడంతో నెల రోజులుగా 250కి పైగా ఓపీ నమోదవుతోందని ఆస్పత్రి వైద్యులు తెలుపుతున్నారు. ఇక్కడ 30 పడకలే ఉండడం.. ఇన్‌పేషెంట్లకు సరిపోకపోవడంతో ఒక్కో మంచంపై ఇద్దరు రోగులను ఉంచుతున్నారు. – పరకాల

8 రోజుల్లో 23 మంది డెంగీతో అడ్మిట్‌

చిన్నారులను సైతం వణికిస్తున్న జ్వరాలు

ప్రత్యేక ఓపీతో ఎంజీఎంలో వైద్యచికిత్సలు

శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్‌ శ్రీ 20251
1/6

శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్‌ శ్రీ 20252
2/6

శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్‌ శ్రీ 20253
3/6

శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్‌ శ్రీ 20254
4/6

శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్‌ శ్రీ 20255
5/6

శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్‌ శ్రీ 20256
6/6

శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement