
నిర్వహణలో నిర్లక్ష్యమెందుకు?
వరంగల్ అర్బన్: పోతన సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు సరిపడా వసతులు కల్పించినా ఆపరేషన్, నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో కమిషనర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ట్రాన్స్‌ఫర్ స్టేషన్ అపరిశుభ్రంగా ఉండడంపై అధికారులను మందలించారు. హనుమకొండలోని నయీంనగర్‌లో ఓల్డ్ విజిటేబుల్ మార్కెట్ వద్ద ఉన్న బయో కంపోస్ట్ యూనిట్‌ను పరిశీలించారు. హనుమకొండ ఏనుగులగడ్డ ప్రాంతంలో పార్కింగ్ చేసి ఉన్న బస్సుల్ని ఖాళీ చేయాలని బస్సు యజమానులను ఆదేశించారు. పోతన సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను కమిషనర్ సాయంత్రం మరోమారు తనిఖీ చేసి నిర్వహణపై సూచనలిచ్చారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎస్‌ఈ సత్యనారాయణ, ఎంహెచ్‌ఓ రాజేశ్, ఈఈలు రవికుమార్, మహేందర్, మాధవీలత, డీఈ సారంగం, ఏఈ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
పోతన సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ తనిఖీ