
పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి
హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య
హన్మకొండ: ప్రజలు పొగాకు, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ ఎన్జీఓస్ కాలనీలోని వడ్డేపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో టొబాకో ప్రీ యూత్ క్యాంపెయిన్‌ను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టొబాకో ప్రీ యూత్ క్యాంపెయిన్ 3.0లో భాగంగా.. డిసెంబర్ 8 వరకు 60 రోజులు యువతే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 60 రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాల ఆవరణకు వంద గజాల దూరం వరకు పొగాకుకు సంబంధించిన దుకాణాలు ఉండకుండా చూడాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. బహిరంగ ప్రదేశంలో పొగాకు ఉత్పత్తులు వినియోగించవద్దని సూచించారు. ర్యాలీ తీసిన అనంతరం ఎన్జీఓస్ కాలనీ కూడలిలో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇక్తేదార్ అహ్మద్, వైద్యాధికారి డాక్టర్ మాలిక, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్‌రెడ్డి, సోషల్ వర్కర్ నరేశ్, హెల్త్ సూపర్‌వైజర్ గోవర్ధన్‌రెడ్డి, కమ్యూనిటీ ఆర్గనైజర్ మానస, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
పొగాకు ఉత్పత్తులపై అవగాహన:
వరంగల్ డీఎంహెచ్‌ఓ సాంబశివరావు
దేశాయిపేట: పొగాకు ఉత్పత్తులతో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు వరంగల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.సాంబశివరావు తెలిపారు. నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా దేశాయిపేటలోని సీకేఎం కాలేజీలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధూమపానంతో వ్యక్తిగత అనారోగ్య సమస్యలు, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని అన్నారు. సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ ధర్మారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ వరప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కొమురయ్య, ప్రోగ్రాం అధికారి మోహన్‌సింగ్, సైకియాట్రిస్ట్ భరత్, స్థానిక వైద్యాధికారి భరత్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయపాల్‌రెడ్డి, ఎన్‌సీసీ అధికారి కెప్టెన్ డాక్టర్ సతీశ్‌కుమార్, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్, సోమేశ్వర్, ప్రకాశ్‌రెడ్డి, కోర్నేలు తదితరులు పాల్గొన్నారు.

పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి