ఈవీ.. ఈజీ డ్రైవ్‌! | - | Sakshi
Sakshi News home page

ఈవీ.. ఈజీ డ్రైవ్‌!

Oct 10 2025 6:42 AM | Updated on Oct 10 2025 6:42 AM

ఈవీ..

ఈవీ.. ఈజీ డ్రైవ్‌!

ఉమ్మడి జిల్లాలో ఈవీల జోరు..

ఖిలా వరంగల్‌ : కాలుష్య నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్‌ వాహన (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అలాగే, పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యతతోపాటు పెరిగిన పెట్రోల్‌ ధరలతో ప్రజలు కూడా ఈవీ వాహనాల వైపు చూస్తున్నారు. ఫలితంగా వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో ఈ వాహన కొనుగోళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. 2019–2020 వరకు ఉమ్మడి జిల్లాలో 800లోపు ఉండగా.. ఇప్పటికే ఈఏడాది సెప్టెంబర్‌ వరకు 11వేల దాటింది. విద్యుత్‌ కార్లు సంఖ్య ఉమ్మడి జిల్లాలో 800 వరకు పెరిగాయని మార్కెటింగ్‌ నిపుణులు చెబుతున్నారు. కాగా, కొనుగోలుదారుల నంచి చార్జింగ్‌ స్టేషన్లలో ధరలు ఎక్కువ ఉండడం భారమవుతోందనే మాట వినిపిస్తోంది.

అని రకాల వాహనాలకు

ఉచిత రిజిస్ట్రేషన్‌ వర్తింపు..

గతంలో వంద సీసీ కన్నా తక్కువ సామర్థ్యమున్న ద్విచక్రవాహనాలకు ఉచిత రిజిస్ట్రేషన్‌ సదుపాయం ఉండేది. నూతన పాలసీతో అన్ని రకాల ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆర్టీఏలో ఉచిత రిజిస్ట్రేషన్‌ అవకాశం కల్పించారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, గూడ్స్‌, బస్సులు అన్నింటి రిజిస్ట్రేషన్‌ రిజిస్ట్రేషన్‌ రుసుం ఉచితం. గతంలో వాహనదారుడు రెండో వాహనం కొనుగోలు చేస్తే 2 శాతం పన్ను ఉండేది. ఇప్పుడు ఈవీ రెండో వాహనమైతే పన్ను ఉండకపోవడం చాలా మందికి ఊరటం కలిగించే అంశం. ఉచిత రిజిస్ట్రేషన్‌ విధానం 31 డిసెంబర్‌ 2026 వరకు అమలులో ఉండనుంది.

విద్యుత్‌ సంస్థలతోనూ ఒప్పందాలు..

గతంలో పెట్రోల్‌ బంకుల్లో మాత్రమే చార్జింగ్‌ స్టేషన్లు ఉండేవి. ఇప్పుడు ప్రధాన జాతీయ రహదారుల పక్కన పెట్రోల్‌ బంకులు, హోటళ్లు ప్రాంగణంలో ఈవీ వాహనాల చార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల పబ్లిక్‌, ప్రైవేట్‌ కలిసి 25లోపు ఉన్నాయి. కాగా, ఫాస్ట్‌ చార్జింగ్‌ కేంద్రాలు వాహన షోరూమ్‌ల్లో మాత్రమే ఉన్నాయి. విక్రయాల అభివృద్ధికి అనుగుణంగా ఇప్పడిప్పుడే చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయని, కార్ల కంపెనీలతోపాటు ప్రైవేట్‌ సంస్థలు ఆ మేరకు ముందుకొచ్చి విద్యుత్‌ సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 11వేలకు పైగా ఈవీ వాహనాలు ఉన్నాయి. ఇందులో వరంగల్‌ జిల్లాలో ప్రస్తుతం బైక్‌లు 2,728, కార్లు 128, ఆటోలు 93, త్రివీలర్‌ గూడ్స్‌ 56, లైట్‌గూడ్స్‌ 24, క్లాబ్‌ 1.. మొత్తం 3,030 వాహనాలు ఉన్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈవీ ఆర్టీసీ బస్సులు రోడ్డు ఎక్కాయి. వాటి సేవలను ప్రజలు వినియోగించుకుంటున్నారు. ఈ వాహనాల సంఖ్య పెరగడంతో జిల్లాలో ఈవీ చార్జీంగ్‌ కేంద్రాల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. తెలంగాణ ఇంధన వనరుల పురుత్పాదక సంస్థ ఆధ్వర్యంలో ప్రధాన రహదారులపై నెలకొల్పేందుకు స్థల సేకరణలో నిమగ్నమయ్యారు.

ఆర్టీఏలో ఉచిత రిజిస్ట్రేషన్‌కు అవకాశం

పెట్రోల్‌ బంక్‌, హోటల్‌లలో ఫాస్ట్‌ చార్జింగ్‌ మిషన్లు

సద్వినియోగం చేసుకుంటే

పర్యావరణానికి మేలు

జీఎస్టీ తగ్గింపుతో

పెరుగుతున్న విక్రయాలు..

జీఎస్టీ తగ్గింపుతోపాటు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీతో విద్యుత్‌ వాహనాల విక్రయాలు పెరుగుతున్నాయి. రూ.లక్ష విలువైన ద్విచక్రవాహనం కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్‌, ఇతర చార్జీలకు కనీసం రూ. 8వేల వరకు ఖర్చు అవుతుంది. అదే ఎలక్ట్రిక్‌ వెహికల్‌ కొనుగోలు చేస్తే చార్జీల భారం తగ్గనుంది. ద్విచక్రవాహనానికి రోజుకు కనీసం 5 గంటల చార్జింగ్‌ పెడితే 3 యూనిట్ల కరెంట్‌ ఖర్చు కానుంది. ఈ లెక్కన యూనిట్‌కు రూ.6 చొప్పున రూ.18 ఖర్చు అయితే వంద కిలోమీటర్లు దూరం ప్రయాణించొచ్చు. పెట్రోల్‌ వాహనమైతే రూ.180 ఖర్చు అవుతుంది. దీంతో ప్రతి ఒక్కరూ ఈవీ వైపుకు మళ్లుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహంతో ఉండడంతో ఈవీ వి నియోగం భాగా పె రిగిపోతోంది.

ఈవీ.. ఈజీ డ్రైవ్‌!1
1/2

ఈవీ.. ఈజీ డ్రైవ్‌!

ఈవీ.. ఈజీ డ్రైవ్‌!2
2/2

ఈవీ.. ఈజీ డ్రైవ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement