
బీసీల రిజర్వేషన్లు అడ్డుకునే యత్నాన్ని విరమించుకోవాలి
హన్మకొండ: బీసీల రిజర్వేషన్ల పెంపును అడ్డుకునే ప్రయత్నాన్ని విరమించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవి కృష్ణ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని కాళోజీ కూడలిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెడ్డి జాగృతి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బైరి రవి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని రిజర్వేషన్ వ్యతిరేకులైన రెడ్డి జాగృతి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని, ఇటీవల బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవాలని సుప్రీంకోర్టులో గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. బీసీ రిజర్వేషన్లు అన్యాయంగా అడ్డుకోవాలని రెడ్డి జాగృతి చూస్తుంటే ప్రధాన పార్టీల అగ్ర నాయకులు ఎవరు స్పందించడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, నాయకులు దాడి మల్లయ్య యాదవ్, బోనగాని యాదగిరి గౌడ్, మాదం పద్మజ దేవి, మాడిశెట్టి అరుంధతి, తడక సుమన్ గౌడ్, దొడ్డపల్లి రఘుపతి, కాసగాని అశోక్, దాడి రమేశ్ యాదవ్, ఏరుకొండ పవన్ కుమార్, పులి మోహన్ గౌడ్, తంగళ్లపల్లి రమేశ్, పెరుమాండ్ల అనిల్ గౌడ్, పంజాల మధు తదితరులు పాల్గొన్నారు.