
రైతులతో సమావేశం
నయీంనగర్: ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం భూములు సేకరించేందుకు ఆరెపల్లి గ్రామానికి చెందిన రైతులతో బుధవారం ‘కుడా’ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందులో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, ‘కుడా’ వీసీ చాహత్ బాజ్‌పాయ్, పీఓ అజిత్‌రెడ్డితో కలిసి ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి రైతులతో మాట్లాడారు. ప్రొజెక్టర్ ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చే ప్రదేశాలను చూపిస్తూ, జరిగే అభివృద్ధిని రైతులకు వివరించారు. భూములు సేకరించి అభివృద్ధి చేస్తామన్నారు. సానుకూలంగా స్పందించిన రైతులు సమయం కావాలని కోరారు.
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ముఖ గుర్తింపు (ఎఫ్‌ఆర్‌ఎస్) హాజరు నమోదు వందశాతం పూర్తి చేసినట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. బుధవారం హాజరు రిజిస్ట్రేషన్ తీరుతెన్నులను కళాశాలల వారీగా సమీక్షించినట్లు పేర్కొన్నారు.