వైన్స్‌కు 11 దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

వైన్స్‌కు 11 దరఖాస్తులు

Oct 9 2025 6:08 AM | Updated on Oct 9 2025 6:08 AM

వైన్స

వైన్స్‌కు 11 దరఖాస్తులు

వైన్స్‌కు 11 దరఖాస్తులు పార్ట్‌టైం అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జోనల్‌ కమిటీ ఎన్నిక విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకుతో ఎంఓయూ

కాజీపేట అర్బన్‌: హనుమకొండ జిల్లాలోని 67 వైన్స్‌కు బుధవారం 11 దరఖాస్తులను హనుమకొండ జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌కు కలెక్టరేట్‌లోని డీపీఈఓ కార్యాలయంలో అందజేశారు. కాగా, టెండర్ల ప్రకటన వెలువడిన నాటి నుంచి బుధవారం వరకు 35 దరఖాస్తులు అందాయి.

కేయూ క్యాంపస్‌: పార్ట్‌టైం అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని కేయూ పార్ట్‌ టైం అధ్యాపకుల అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ వై.రాంబాబు అన్నారు. బుధవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌ అధ్యాపకులతో సమానంగా పనిచేస్తున్నా, అన్ని అర్హతలు ఉన్నా, వేతనాల్లో మాత్రం వివక్ష కొనసాగుతోందన్నారు. పార్ట్‌ టైం అధ్యాపకులకు కూడా 65 ఏళ్ల వరకు ఉద్యోగ విరమణ ఉండేలా పొడిగించాలని డిమాండ్‌ చేశారు. ఆ అసోసియేషన్‌ బాధ్యులు డాక్టర్‌ తిరుణహరిశేషు మాట్లాడుతూ.. పార్ట్‌టైం అధ్యాపకులను కాంట్రాక్టు అధ్యాపకులుగా అప్‌గ్రేడ్‌ చేయాలన్నారు. సమావేశంలో అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ నరేందర్‌నాయక్‌, బాధ్యులు డాక్టర్‌ బూర శ్రీధర్‌, డాక్టర్‌ నివాస్‌, డాక్టర్‌ ఎర్రబొజ్జు రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

హన్మకొండ: ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ కరీంనగర్‌ జోనల్‌ స్థాయి నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. హనుమకొండ రాంనగర్‌లోని సుందరయ్య భవన్‌లో స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జోనల్‌ స్థాయి సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కరీనంగర్‌ జోనల్‌ అధ్యక్షుడిగా సీహెచ్‌.రాంచందర్‌, కార్యదర్శిగా జి.లింగమూర్తి, ఉపాధ్యక్షుడిగా మల్లయ్య, సహాయ కార్యదిర్శిగా ఎం.రాజయ్య, కోశాధికారిగా శ్రీనివాసులు ఎన్నికయ్యారు.

ఎంజీఎం: విద్యార్థులు క్రమశిక్షణతో చదివి భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని కాకతీయ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.సంధ్య అన్నారు. ఇటీవల జరిగిన నీట్‌ కాకతీయ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు పొందిన నూతన విద్యార్థులకు బుధవారం కాలేజీలోని ఎన్‌ఆర్‌ఐ ఆడిటోరియంలో ఒరియెంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఈకార్యక్రమాన్ని ప్రిన్సిపాల్‌.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అమె మాట్లాడుతూ.. కాకతీయ మెడికల్‌ కాలేజీ చరిత్ర, వైద్యరంగంలో సాధించిన ప్రతిష్టాత్మక విజయాలను వివరించారు. కార్యక్రమంలో కేఎంసీ వైస్‌ ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ రామ్‌కుమార్‌ రెడ్డి, డాక్టర్‌ లక్ష్మీపతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కేయూ క్యాంపస్‌: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌ ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకుతో ఎంఓయూ చేసుకున్నట్లు బుధవారం ఆకాలేజీ ప్రిన్సిపాల్‌ ఎస్‌.జ్యోతి తెలిపారు. ఈ ఎంఓయూతో విద్యార్థులకు పోస్టాఫీస్‌లో పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు ద్వారా ఇంటర్న్‌షిప్‌ పొందే అవకాశం ఏర్పడిందన్నారు. ఎంఓయూ ద్వారా ట్రైనింగ్‌ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ సర్టిఫికెట్లు అందజేస్తారని జ్యోతి వెల్లడించారు. కార్యక్రమంలో ఇండియన్‌ పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ హనుమకొండ డీహెచ్‌ఎస్‌డీ ప్రమోద్‌ వర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌ ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్స్‌ అధికారి ఎల్‌.జితేందర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎన్‌ఎం రెహమాన్‌, ఫిజిక్స్‌ విభాగం ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ వరలక్ష్మి అధ్యాపకులు తదితరులున్నారు.

వైన్స్‌కు 11 దరఖాస్తులు1
1/1

వైన్స్‌కు 11 దరఖాస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement