
ఘనంగా ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు
హసనపర్తి: హసన్‌పర్తి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ డే వేడుకలను హసన్‌పర్తిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ చకిలం రాజేశ్వర్‌రావు పాల్గొని కేక్ కట్ చేశారు. వాసవి క్లబ్ హసన్‌పర్తి అధ్యక్షుడు సండ్రు నాగేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి మాధవశంకర్, వాసవి క్లబ్ జిల్లా జాయింట్ సెట్రకరీ అప్పని శంకర్, మాజీ అధ్యక్షులు భీష్మనాథం, గౌరిశెట్టి కృష్ణమూర్తి, నాగమళ్ల సుధీర్, చిదర కరంచంద్, సభ్యులు నటరాజ్, రవీందర్, భూపతి కృష్ణమూర్తి, సండ్రు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.